‘పూరి ముఖంలో సక్సెస్‌ కనిపించింది’ | Ram Gopal Varma Tweet About iSmart Shankar and Puri Jagannadh | Sakshi
Sakshi News home page

‘పూరి ముఖంలో సక్సెస్‌ కనిపించింది’

Jul 17 2019 11:55 AM | Updated on Jul 17 2019 11:55 AM

Ram Gopal Varma Tweet About iSmart Shankar and Puri Jagannadh - Sakshi

ఈ గురువారం రిలీజ్ కు రెడీ అవుతున్న మాస్ మసాలా యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ఇస్మార్ట్ శంకర్‌. డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో యంగ్ హీరో రామ్‌ సరికొత్త అవతారంలో తెరకెక్కిన ఈ సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. ఇప్పటికే రిలీజ్‌ అయిన ట్రైలర్స్‌, సాంగ్స్‌కు మంచి రెస్పాన్స్‌ రావటంతో చిత్రయూనిట్‌ సక్సెస్‌పై కాన్ఫిడెంట్‌గా ఉన్నారు.

పూరి గురువు, సంచలన దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ కూడా సినిమా సక్సెస్‌ అవుతుందంటూ ఆశాభావం వ్యక్తం చేశారు. పూరి తాజా ఇంటర్వ్యూ షోటోను తన సోషల్ మీడియా పేజ్‌లో పోస్ట్ చేసిన వర్మ ‘పూరి గారు ఇస్మార్ట్‌ శంకర్‌కు అడ్వాన్స్ బుకింగ్స్‌ భారీగా అవుతున్నాయి. నేను ఇప్పటికే మీ ముఖంలో సక్సెస్‌ చూశాను’ అంటూ ట్వీట్ చేశారు.


Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement