Ram Gopal Varma's Bhairava Geetha Postponed to Dec 7 Due to Censor Related Technical Issues - Sakshi
Sakshi News home page

Nov 28 2018 10:09 AM | Updated on Nov 28 2018 12:07 PM

Ram Gopal Varma Bhairava Geetha Release Postponed - Sakshi

సంచలన దర్శకుడు రామ్‌ గోపాల్ వర్మ సమర్పణలో తెరకెక్కిన రొమాంటిక్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ భైరవ గీత. తెలుగు, కన్నడ భాషల్లో ఒకేసారి తెరకెక్కించిన ఈ సినిమాను 2.ఓ కు పోటిగా ఈ నెల 30న రిలీజ్ చేసేందుకు ప్లాన్‌ చేశారు. అందుకు తగ్గట్టుగా వర్మ ప్రచారం కార్యక్రమాలను కూడా తన స్టైల్‌లో కొనసాగించాడు. 2.ఓ చిన్న పిల్లల సినిమా అంటూ కామెంట్ చేసి భైరవ గీతకు కావాల్సినంత పబ్లిసిటీ తీసుకువచ్చాడు.

అయితే చివరి నిమిషంలో వర్మ వెనుకడుగు వేశాడు. సెన్సార్ సమస్యలతో పాటు సాంకేతిక కారణాల వల్ల భైరవ గీత సినిమా రిలీజ్‌ వాయిదా వేసినట్టుగా వెల్లడించారు. వారం ఆలస్యం డిసెంబర్‌ 7న సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుందని ప్రకటించారు. సిద్ధార్థ్‌ తాతోలు దర్శకత్వంలో తెరకెక్కిన ఈసినిమాలో ధనుంజయ్‌, ఇర్రామోర్‌లు హీరోహీరోయిన్లుగా నటించారు.


Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement