సానియాతో స్టెప్పులేసిన రామ్‌చరణ్‌

Ram Charan Dance With Farah Khan At Sania Sisters Wedding Reception - Sakshi

భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా చెల్లెలు ఆనమ్ మీర్జా వివాహం అంగరంగా వైభవం జరిగిన విషయం తెలిసిందే. టీమిండియా మాజీ సారథి అజహరుద్దీన్‌ కుమారుడు మహ్మద్‌ అసదుద్దీన్‌తో ఆనమ్‌ వివాహం హైదరాబాద్‌లో అతి కొద్దిమంది సన్నిహితులు, కుటుంబసభ్యుల మధ్య జరిగింది. కాగా, ఆనమ్‌-అసద్‌ల వివాహ రిసెప్షన్‌ను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సినీ, రాజకీయ, క్రీడా రంగాలకు చెందిన సెలబ్రిటీలు హాజరై నూతన వధూవరూలను ఆశీర్వదించారు. అయితే ఈ వివాహ రిసెప్షన్‌లో మెగాపవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌- ఉపాసన దంపతులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.


అయితే ఈ వేడుకలో సానిమా మీర్జాతో కలిసి రామ్‌చరణ్‌ స్టెప్పులేసిన వీడియోను ఉపాసన సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. వీరిద్దరితో పాటు బాలీవుడ్‌ కొరియోగ్రఫర్‌ ఫరాఖాన్‌ కాలుకదిపారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో తెగ హల్‌చల్‌ చేస్తోంది. చెర్రీకి ఏ మాత్రం తీసిపోకుండా సానియా డ్యాన్స్‌ చేస్తున్నారని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. ఈ వీడియోతో పాటు రిసెప్షన్‌కు సంబంధించిన పలు ఫోటోలను కూడా ఉపాసన సోషల్‌ మీడియాలో షేర్‌ చేయడంతో అవి వైరల్‌గా మారాయి. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top