చరణ్ క్యారెక్టర్‌పై హింట్ ఇచ్చిన ఉపాసన | Ram Charan and Upasanas Christmas Celebrations at Ashray Akruthi | Sakshi
Sakshi News home page

చరణ్ క్యారెక్టర్‌పై హింట్ ఇచ్చిన ఉపాసన

Dec 23 2017 11:59 AM | Updated on Dec 23 2017 11:59 AM

Ram Charan and Upasanas Christmas Celebrations at Ashray Akruthi - Sakshi

మెగాస్టార్ రామ్ చరణ్ ఈ ఏడాది క్రిస్టమస్ వేడుకలను దివ్యాంగులతో కలిసి జరుపుకున్నారు. ఈ సంబరాల్లో చరణ్‌ తో పాటు ఆయన భార్య ఉపాసన కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా తన ఆనందాన్ని సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకున్న ఉపాసన, రంగస్థలంలో సినిమాలో చరణ్ క్యారెక్టర్ పై హింట్ ఇచ్చారు. చిన్నారులతో సరదాగా గడిపిన వీడియోనే ఫోటలను షేర్ చేసిన ఉపాసన చరణ్ ఈ చిన్నారులకు ఇంతగా ఎందుకు దగ్గరయ్యారో మీకు త్వరలోనే తెలుస్తుంది అంటూ ట్వీట్ చేశారు.

చెర్రీ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో రంగస్థలంలో సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. సమంత హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో చరణ్ వినికిడి లోపం ఉన్న వ్యక్తిగా నటిస్తున్నాడన్న టాక్ వినిపిస్తోంది. అయితే ఈ విషయంపై చిత్రయూనిట్ ఇంతవరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. తాజా ఉపాసన పోస్ట్ చూసిన అభిమానులు మాత్రం.. చరణ్ తను చేస్తున్న పాత్ర మూలంగానే దివ్యాంగులకు మరింత దగ్గరయ్యారని భావిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement