శ్రీదేవి లుక్‌లో రకుల్‌

Rakul Preet Singh Sridevi Look In NTr Biopic - Sakshi

నందమూరి బాలకృష్ణ స్వయంగా నటిస్తూ నిర్మిస్తున్న సినిమా యన్‌.టి.ఆర్‌. రెండు భాగాలుగా విడుదల కానున్న ఈ సినిమాలో తొలి భాగంలో ‘యన్‌.టి.ఆర్‌ కథానాయకుడు’లో నందమూరి తారక రామారావు సినీ జీవిత విశేషాలను చూపించనున్నారు. ఇప్పటికే వరుస సర్‌ప్రైజ్‌ లతో అలరిస్తున్న యన్‌టిఆర్‌ టీం తాజాగా మరో పోస్టర్‌ను రిలీజ్ చేశారు.

ఈ సినిమాలో శ్రీదేవి పాత్రలో కనిపిస్తున్న రకుల్‌ ప్రీత్‌ సింగ్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఈ రోజు రకుల్ పుట్టిన రోజు సందర్భంగా ఈ పోస్టర్‌ను రిలీజ్‌ చేశారు. ఈ బయోపిక్‌ కోసం ఎన్టీఆర్, శ్రీదేవి నటించిన వేటగాడు సినిమాలోని ఆకుచాటు పిందే తడిచే పాటను రీమేక్‌ చేస్తున్నారు. ఆ పాటలోని రకుల్‌ లుక్‌నే రిలీజ్ చేశారు చిత్రయూనిట్. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ సినిమాలో ఏఎన్నార్‌గా సుమంత్‌, చంద్రబాబు నాయుడిగా రానా, సావిత్రి పాత్రలో నిత్యామీనన్‌ నటిస్తున్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top