హన్సిక అవుట్... రకుల్ ఇన్! | Rakul Preet Singh enters Pandaga Chesuko’s star cast replacing Hansika Motwani | Sakshi
Sakshi News home page

హన్సిక అవుట్... రకుల్ ఇన్!

May 5 2014 10:40 PM | Updated on Sep 2 2017 6:58 AM

హన్సిక అవుట్... రకుల్ ఇన్!

హన్సిక అవుట్... రకుల్ ఇన్!

ఒకరికి చేదు వార్త... మరొకరికి తీపి వార్త. చేదువార్త హన్సికదైతే, తీపి వార్త రకుల్ ప్రీత్‌సింగ్‌ది. రామ్ హీరోగా మలినేని గోపీచంద్ దర్శకత్వంలో రూపొందనున్న ‘పండగ చేస్కో’

ఒకరికి చేదు వార్త... మరొకరికి తీపి వార్త. చేదువార్త హన్సికదైతే, తీపి వార్త రకుల్ ప్రీత్‌సింగ్‌ది. రామ్ హీరోగా మలినేని గోపీచంద్ దర్శకత్వంలో రూపొందనున్న ‘పండగ చేస్కో’ చిత్రంలో హన్సికను కథానాయికగా అనుకున్నారు. రామ్-హన్సిక అంతకుముందు మస్కా, కందిరీగ చిత్రాల్లో కలిసి చేశారు. హన్సిక తమిళంలో బిజీ కావడంతో ‘పండగ చేస్కో’కి డేట్లు కేటాయించలేని పరిస్థితి ఏర్పడిందట. దాంతో ఆ అవకాశం రకుల్‌కి దక్కింది. ఇప్పటికే గోపీచంద్ పక్కన ఓ సినిమా చేస్తోన్న రకుల్... రామ్ పక్కన నటించే అవకాశం రావడంతో ఉబ్బితబ్బిబ్బవుతున్నారట. ‘పండగ చేస్కో’ చిత్రం ఈ నెల 17న ప్రారంభం కానుంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement