శర్వా–సుందరం? | Raju Sundaram to direct Sharwanand New movie | Sakshi
Sakshi News home page

శర్వా–సుందరం?

Jun 12 2019 4:41 AM | Updated on Jun 12 2019 4:41 AM

Raju Sundaram to direct Sharwanand New movie - Sakshi

హీరోలందరితో స్టెప్పులేయిస్తారు రాజు సుందరం. టాప్‌ యాక్టర్స్‌ నుంచి యంగ్‌ హీరోలతోనూ పనిచేశారాయన. కేవలం డ్యాన్స్‌ మాస్టర్‌గానే కాదు.. అప్పుడప్పుడూ యాక్టర్‌గానూ కనిపిస్తారు. అజిత్‌ నటించిన ‘ఏగన్‌’ (2008) అనే తమిళ చిత్రంతో దర్శకుడుగా మారారు రాజు సుందరం. పదేళ్ల విరామం తర్వాత మళ్లీ యాక్షన్, కట్‌ చెప్పడానికి సిద్ధమయ్యారు. శర్వానంద్‌ హీరోగా రాజు సుందరం దర్శకత్వంలో ఓ సినిమా ప్లాన్‌ చేస్తున్నారని తెలిసింది. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తారట. ఈ ఏడాది చివర్లో ఈ చిత్రం సెట్స్‌ మీదకు వెళ్లే అవకాశాలున్నాయట.

Advertisement
 
Advertisement
Advertisement