‘2.ఓ’.. మరో నాలుగు నెలలు వాయిదా | Rajinikanths 2pointO may be postponed again | Sakshi
Sakshi News home page

Feb 1 2018 3:59 PM | Updated on Feb 1 2018 5:09 PM

2.o moive poster - Sakshi

2.ఓ మూవీ పోస్టర్‌

సౌత్ సూపర్‌స్టార్ రజనీకాంత్‌ హీరోగా గ్రేట్ డైరెక్టర్ శంకర్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ చిత్రం 2.ఓ. వీరి కాంబినేషన్‌లో ఘనవిజయం సాధించిన రోబో సినిమాకు సీక్వల్‌ గా రూపొందుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ యాక్షన్‌ హీరో అక్షయ్‌ కుమార్ ప్రతినాయక పాత్రలో నటించనున్నాడు. ఈ సినిమాను ముందుగా 2018 జనవరిలో రిలీజ్‌ చేయాలని భావించారు. అయితే నిర్మాణాంతర కార్యక్రమాలు పూర్తి కాకపోవటంతో రిలీజ్‌ ను ఏప్రిల్‌కు వాయిదా వేశారు.

అయితే తాజా సమాచారం ప్రకారం 2.ఓ మరోసారి వాయిదా పడిందన్న టాక్ వినిపిస్తోంది. భారీ గ్రాఫిక్స్ తో రూపొందుతున్న ఈ సినిమాలో దాదాపు 11000 విజువల్‌ ఎఫెక్ట్స్‌ షాట్స్ ఉన్నాయట. ఈ గ్రాఫిక్స్ కోసం ఎన్నో దేశాల్లో పని జరుగుతున్నా అనుకున్న సమయానికి పని పూర్తవుతుందో లేదో అన్న అనుమానం వ్యక్తమవుతుంది. దీంతో క్వాలిటీ విషయంలో రాజీ పడకూడదని సినిమాను వాయిదా వేయాలని భావిస్తున్నారట చిత్రయూనిట్‌. 2.ఓనే ఏకంగా ఆగస్టు మూడో వారంలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట. ఈ భారీ చిత్రం వాయిదా పడినట్టుగా వార్తలు పెద్ద ఎత్తున విపిస్తున్నా.. చిత్రయూనిట్ మాత్రం ఇంతవరకు స్పందించలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement