రజనీ ‘పేట్టా’ ఆడియో వస్తోంది!

Rajinikanth Petta audio On 9th December - Sakshi

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ ‘2.ఓ’తో ఇంకొద్దిరోజుల్లోనే ప్రేక్షకుల ముందకు రానున్నాడు. శంకర్‌ డైరెక్షన్‌లో రాబోతోన్న ఈ సినిమా అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఇక దీని తరువాత రజనీ తదుపరి సినిమాను కూడా లైన్లో పెట్టేస్తున్నాడు.

పిజ్జా ఫేమ్‌ కార్తీక్‌ సుబ్బరాజ్‌ డైరెక్షన్‌లో రాబోతోన్న ‘పేట్టా’ చిత్రం ఆడియో రిలీజ్‌ డేట్‌ను ఫిక్స్‌ చేశారు మేకర్స్‌. డిసెంబ ర్‌ 9న పాటలను విడుదలచేయనున్నట్లు ప్రకటించారు. సిమ్రాన్‌, త్రిష కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రాన్ని సన్‌ పిక్చర్స్‌ నిర్మిస్తోంది. ఈ చిత్రానికి అనిరుధ్‌ రవిచంద్రన్‌ సంగీతాన్ని సమకూరుస్తున్నాడు. 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top