చైనాకు వెళ్లనున్న ‘2.ఓ’

Rajinikanth 2point0 Releasing In China On 12th July - Sakshi

ఇండియన్‌ మూవీస్‌కు చైనా మార్కెట్‌ బాగానే కలసివస్తోంది. ఇక్కడి చిత్రాలు అక్కడ బ్లాక్‌ బస్టర్‌హిట్‌లుగా నిలుస్తున్నాయి. బాలీవుడ్‌ చిత్రమైన అంధాదున్‌ చైనాలో రికార్డులు సృష్టించింది. ఇక రీసెంట్‌గా హృతిక్‌ రోషన్‌ హీరోగా నటించిన కాబిల్‌ చిత్రాన్ని చైనాలో విడుదల చేశారు. 

ఇండియన్‌ డైరెక్టర్‌ శంకర్‌, సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ కాంబినేషన్‌లో వచ్చిన 2.ఓ చైనాకు వెళ్లనుంది. దీనికి సంబంధించిన వార్తలు కూడా చైనా మీడియాలో హల్‌చల్‌ చేస్తున్నాయి. జూలై 12న ఈ చిత్రాన్ని చైనాలో విడుదల చేయనున్నారు. అంతేకాకుండా జూలై 25న రష్యాలో కూడా 2.ఓను రిలీజ్‌ చేస్తున్నారు. ఇక్కడ పర్వాలేదనిపించిన 2.ఓ అక్కడ ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top