ఆహా అనుష్క.. ఓహో త్రిష! | rajamouli praises anushka shetty and trisha in upcoming movies | Sakshi
Sakshi News home page

ఆహా అనుష్క.. ఓహో త్రిష!

Aug 21 2015 2:06 PM | Updated on Sep 3 2017 7:52 AM

ఆహా అనుష్క.. ఓహో త్రిష!

ఆహా అనుష్క.. ఓహో త్రిష!

సైజ్ జీరో సినిమాలో డీ గ్లామరస్గా, లావుగా కనిపిస్తున్న అనుష్కను, నాయకి సినిమాలో ఒక చేత్తో కత్తి పట్టుకున్న త్రిషను దర్శకుడు రాజమౌళి పొగడ్తల్లో ముంచెత్తారు.

బాహుబలి రెండో భాగం షూటింగ్ ప్రారంభం కావడానికి ఇంకా కాస్త సమయం ఉన్నట్టుంది.. అందుకే దర్శకుడు రాజమౌళి మిగిలిన సినిమాలు ఎలా ఉన్నాయో, వాటిలో ఎవరెవరు ఎలా చేస్తున్నారో బాగా పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం సైజ్ జీరో సినిమాలో డీ గ్లామరస్గా, లావుగా కనిపిస్తున్న అనుష్కను, నాయకి సినిమాలో ఒక చేత్తో కత్తి పట్టుకున్న త్రిషను ఆయన పొగడ్తల్లో ముంచెత్తారు. ప్రస్తుతం రెండు సినిమాలు బాగా ఆసక్తికరంగా అనిపిస్తున్నాయని రాజమౌళి ట్వీట్ చేశారు.

ఆ రెండు సినిమాల పోస్టర్లు చూస్తుంటేనే ఆసక్తి కలుగుతోందన్నారు. సైజ్ జీరో సినిమాలో స్వీటీ (అనుష్క) చాలా చక్కగా ఉందని చెప్పారు. ఇక నాయకి సినిమాలో త్రిష అయితే.. ముఖంలో చిరునవ్వులు చిందిస్తూ, కుడిచేత్తో కత్తి, ఎడమ చేత్తో పూజాసామగ్రి పట్టుకుని వెళ్తున్న గెటప్ కూడా చాలా బాగుందని వ్యాఖ్యానించారు. నాయకి పోస్టర్ గురించి రాజమౌళి అంతటి దర్శకుడు ట్వీట్ చేయడంతో.. ఆ చిత్ర దర్శకుడు గోవి గోవర్ధన్ ఎంతగానో మురిసిపోయారు. ఆయనకు కృతజ్ఞతలు చెప్పారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement