ఇద్దరి లోకం ఒకటే

Raj Tarun new film Iddari Lokam Okate movie launch - Sakshi

యువ కథానాయకుడు రాజ్‌తరుణ్‌ ‘ఇద్దరి లోకం ఒకటే’ అంటున్నారు. ఆయన హీరోగా జి.ఆర్‌.కృష్ణ దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌పై తెరకెక్కుతోన్న ‘ఇద్దరి లోకం ఒకటే’ సినిమా సోమవారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. చిత్రనిర్మాతలు ‘దిల్‌’ రాజు, శిరీష్‌ ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు జరిగాయి. ముహూర్తపు సన్నివేశానికి రచయిత, దర్శకుడు విజయేంద్ర ప్రసాద్‌ క్లాప్‌ ఇవ్వగా, ప్రసాద్‌  కెమెరా స్విచ్చాన్‌ చేశారు. ‘దిల్‌’రాజు మనవడు మాస్టర్‌ ఆరాన్‌‡్ష గౌరవ దర్శకత్వం వహించాడు.

ఈ సందర్భంగా ‘దిల్‌’ రాజు మాట్లాడుతూ– ‘‘రాజ్‌తరుణ్‌తో మా బ్యానర్‌లో చేస్తోన్న రెండో చిత్రం ‘ఇద్దరి లోకం ఒకటే’. యువత, కుటుంబ ప్రేక్షకులకు నచ్చేలా ఈ సినిమా ఉంటుంది. ఈ చిత్రంతో జి.ఆర్‌. కృష్ణని దర్శకుడిగా పరిచయం చేస్తున్నాం. మిక్కీ జె.మేయర్‌ సంగీతం, సమీర్‌ రెడ్డి సినిమాటోగ్రఫీ, అబ్బూరి రవి మాటలు సమకూర్చుతున్నారు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరా లను తెలియజేస్తాం’’ అన్నారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top