అవికా గోర్ స్థానంలో హేబా పటేల్ | raj tarun, hebha patel to repeat their magic again | Sakshi
Sakshi News home page

అవికా గోర్ స్థానంలో హేబా పటేల్

Dec 3 2015 10:00 AM | Updated on Sep 3 2017 1:26 PM

అవికా గోర్ స్థానంలో హేబా పటేల్

అవికా గోర్ స్థానంలో హేబా పటేల్

సినీరంగం సక్సెస్ వెంటే పరిగెడుతోందన్న విషయం మరోసారి రుజువైంది. సుకుమార్ నిర్మాణం రాజ్ తరుణ్ హీరోగా తెరకెక్కి ఘనవిజయం సాధించిన సినిమా కుమారి 21 ఎఫ్, రిలీజ్ సమయంలో...

సినీరంగం సక్సెస్ వెంటే పరిగెడుతోందన్న విషయం మరోసారి రుజువైంది. సుకుమార్ నిర్మాణంలో రాజ్ తరుణ్ హీరోగా తెరకెక్కి ఘన విజయం సాధించిన సినిమా కుమారి 21 ఎఫ్. విడుదల సమయంలో డివైడ్ టాక్ వచ్చినా కలెక్షన్ల విషయంలో మాత్రం ఇండస్ట్రీ వర్గాలను కూడా ఆశ్చర్యపరిచింది. దీంతో ఈ సినిమాలో హీరో హీరోయిన్లుగా నటించిన రాజ్ తరుణ్, హేబా పటేల్లు లీడ్ రోల్స్లో మరో సినిమాను ప్లాన్ చేస్తున్నారు.

మంచు విష్ణు హీరోగా తనే నిర్మిస్తున్న సినిమాలో సెకండ్ హీరో క్యారెక్టర్కు రాజ్ తరుణ్ను ఎంపిక చేశారు. జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రాజ్ తరుణ్కు జోడీగా తొలుత అవికా గోర్ను తీసుకున్నారు. అయితే కుమారి 21 ఎఫ్ సక్సెస్ తరువాత మనసు మార్చుకున్న చిత్రయూనిట్, అవికా ప్లేస్లో హేబాను సెలెక్ట్ చేశారు. ప్రస్తుతం సీతమ్మ అందాలు, రామయ్య సిత్రాలు సినిమా షూటింగ్లో బిజీగా ఉన్న రాజ్ తరుణ్ ఆ తరువాత జి నాగేశ్వరరెడ్డి సినిమా షూటింగ్లో పాల్గొననున్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement