వర్మ కథతో రాజ్తరుణ్ డైరెక్షన్ | raj tarun directing ramgopal varma story | Sakshi
Sakshi News home page

వర్మ కథతో రాజ్తరుణ్ డైరెక్షన్

Dec 13 2015 1:43 PM | Updated on Sep 3 2017 1:57 PM

వర్మ కథతో రాజ్తరుణ్ డైరెక్షన్

వర్మ కథతో రాజ్తరుణ్ డైరెక్షన్

వరుసగా వార్తల్లో వ్యక్తిగా ఉంటున్న రామ్గోపాల్ వర్మ మరో సంచలనానికి తెర తీశాడు. ఇప్పటికే తన దగ్గర దర్శకత్వ శాఖలో పనిచేసిన చాలా మందిని దర్శకులు పరిచయం చేసిన...

వరుసగా వార్తల్లో వ్యక్తిగా ఉంటున్న రామ్గోపాల్ వర్మ మరో సంచలనానికి తెర తీశాడు. ఇప్పటికే తన దగ్గర దర్శకత్వ శాఖలో పనిచేసిన చాలా మందిని దర్శకులుగా పరిచయం చేసిన వర్మ తాజాగా ఓ యంగ్ హీరోను దర్శకుడిగా పరిచయం చేయబోతున్నాడు. హ్యాట్రిక్ హిట్స్తో టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ హీరోగా క్రేజ్ సొంతం చేసుకున్న రాజ్ తరుణ్, రామ్గోపాల్ వర్మ కథతో సినిమాను తెరకెక్కించడానికి రెడీ అవుతున్నాడు.

రాజ్ తరుణ్ హీరోగా తెరకెక్కిన సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు సినిమా సంక్రాంతికి రిలీజ్ అవుతోంది. ఈ సినిమా తరవాత మంచు విష్ణు నిర్మిస్తున్న సినిమాతో పాటు రామ్గోపాల్ వర్మ తెరకెక్కించనున్న మూకీ సినిమాలో హీరోగా నటించనున్నాడు. హీరోగా బిజీగా ఉండగానే దర్శకత్వం మీద దృష్టిపెడుతున్నాడు రాజ్ తరుణ్. వర్మ రాసిన ఓ ప్రేమకథను డైరెక్ట్ చేయడానికి రెడీ అవుతున్నాడు. ఈ విషయాన్ని రాజ్ తరుణ్ స్వయంగా తెలిపాడు.

దాదాపు 50 షార్ట్ ఫిలింస్కు దర్శకత్వ శాఖలో పని చేసిన రాజ్ తరుణ్ సినీరంగంలోకి కూడా దర్శకుడు కావాలనే ఉద్దేశంతోనే అడుగుపెట్టాడు. అయితే అనుకోకుండా వచ్చిన అవకాశం రాజ్ తరుణ్ను హీరోని చేసింది. ఇప్పటికీ కాలీ సమయం కథలు రాస్తూనే గడుపుతాననే రాజ్ తరుణ్, వర్మ స్కూల్ నుంచి దర్శకుడిగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement