రాయ్‌లక్ష్మీ ఇమేజ్‌ను బ్రేక్‌ చేస్తుంది! | Rai Lakshmi Cinderella Movie Director Comments About Her Characterisation | Sakshi
Sakshi News home page

‘ఈ సినిమా రాయ్‌లక్ష్మీ ఇమేజ్‌ను బ్రేక్‌ చేస్తుంది’

Jun 28 2019 12:41 PM | Updated on Jun 28 2019 12:43 PM

Rai Lakshmi Cinderella Movie Director Comments About Her Characterisation - Sakshi

తమిళసినిమా : నటి రాయ్‌లక్ష్మిని కొత్తగా ఆవిష్కరించేలా ‘సిండ్రెల్లా’ ఉంటుందని ఆ సినిమా దర్శకుడు వినో వెంకటేశ్‌ అంటున్నారు. బెంగళూర్‌కు చెందిన ఈయన మల్టీమీడియాలో పట్టభద్రుడు. దర్శకుడు ఎస్‌జే.సూర్య వద్ద నాలుగేళ్లు సహాయ దర్శకుడిగా పని చేసిన వినో వెంకటేశ్‌ సిండ్రెల్లా చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ సందర్భంగా సినిమా గురించి మాట్లాడుతూ.. సిండ్రెల్లా అన్నది దెయ్యం ఇతివృత్తంతో తెరకెక్కిస్తున్న కథా చిత్రమేనన్నారు. అయితే ఇప్పుడు వస్తున్న హర్రర్‌తో కూడిన థ్రిల్లర్‌ కథా చిత్రాలకు భిన్నంగా పలు జనరంజకమైన అంశాలతో కూడి ఉంటుందన్నారు. ఇందులో నటి రాయ్‌లక్ష్మి  పోషిస్తున్న పాత్ర ఆమెకున్న గ్లామర్‌ ఇమేజ్‌ను బ్రేక్‌ చేస్తుందని అన్నారు. అంతే కాదు ఆమె కెరీర్‌లో ముఖ్యమైన చిత్రంగా నిలిచిపోతుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

ఇక ఈ చిత్రంలో నటి సాక్షీ అగర్వాల్‌ ప్రతినాయకిగా నటించినట్లు వినో వెంకటేశ్‌  తెలిపారు. ఆమె పాత్ర సినీ పరిశ్రమలో చర్చనీయాంశం అవుతుందని అభిప్రాయ పడ్డారు. ఇంకా కల్లూరి వినోద్, గాయని ఉజ్జాయినిగజరాజ్‌ ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. కాంచన-2 చిత్రం ఫేమ్‌ అశ్వమిత్ర సంగీతాన్ని, తెలుగులో లక్ష్మీస్‌ ఎన్‌టీఆర్‌ చిత్రానికి పని చేసిన రామి ఛాయాగ్రహణం అందించారని తెలిపారు. తమిళం, తెలుగు భాషల్లో తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని ఆబాలగోపాలాన్ని రంజింపజేసే విధంగా రూపొందించినట్లు చెప్పారు. నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న సిండ్రెల్లా చిత్రాన్ని ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారనే నమ్మకం ఉందన్నారు. త్వరలోనే చిత్రాన్ని విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్లు దర్శకుడు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement