రఘుపతి వెంకయ్య నాయుడు ఫిల్మ్‌ నగర్‌గా మార్చాలి | Raghupathi Venkaiah Naidu is 79 Vardhanthi | Sakshi
Sakshi News home page

రఘుపతి వెంకయ్య నాయుడు ఫిల్మ్‌ నగర్‌గా మార్చాలి

Mar 17 2020 1:39 AM | Updated on Mar 17 2020 1:39 AM

Raghupathi Venkaiah Naidu is 79  Vardhanthi - Sakshi

‘‘తెలుగు సినిమా పరిశ్రమ కోసం తన జీవితాన్ని అంకితం చేసిన రఘుపతి వెంకయ్య నాయుడు పేరును ఫిల్మ్‌నగర్‌కి చేర్చి ‘రఘుపతి వెంకయ్యనాయుడు ఫిల్మ్‌ నగర్‌’గా మార్చాలి’’ అని ‘రఘుపతి వెంకయ్య అకాడమీ’ సభ్యులు డిమాండ్‌ చేశారు. హైదరాబాద్‌ ఫిల్మ్‌ చాంబర్‌ ఎదుట ఉన్న రఘుపతి వెంకయ్య నాయుడు విగ్రహం వద్ద ఆయన 79వ వర్ధంతిని ‘రఘుపతి వెంకయ్య అకాడమీ’ ఆధ్వర్యంలో నిర్వహించారు. ‘‘ఇక నుంచి ప్రతి సంవత్సరం మార్చి 15న రఘుపతి వెంకయ్యగారి వర్ధంతిని, అక్టోబర్‌ 15న జయంతిని ఘనంగా జరుపుతాం’’ అని ‘రఘుపతి వెంకయ్య అకాడమీ’ సభ్యులు పేర్కొన్నారు.

‘‘ఫిల్మ్‌చాంబర్‌ వద్ద రఘుపతి వెంకయ్య నాయుడుగారి విగ్రహాన్ని బాగు చేయించి, దాని చుట్టూ ఫెన్సింగ్, గొడుగు, నిచ్చెనలాంటి వాటిని ఏర్పాటు చేయడానికి కావాల్సిన ఆర్థిక సహాయాన్ని అందిస్తా’’ అని మేధావుల ఫోరం వ్యవస్థాపక అధ్యక్షులు చలసాని శ్రీనివాస్‌ అన్నారు. ఈ కార్యక్రమంలో ‘రఘుపతి వెంకయ్య అకాడమీ’ నూతన అధ్యక్షుడు యన్‌.గోపాలకృష్ణ, ఉపాధ్యక్షుడు పి.విజయ వర్మ, ప్రధాన కార్యదర్శి జె.వి. మోహన్‌ గౌడ్, ఆర్గనైజింగ్‌ కార్యదర్శి బాబ్జీ, సహాయ కార్యదర్శి యస్‌.ఏ.ఖుద్దూస్, కోశాధికారి తుమ్మలపల్లి రామసత్యనారాయణ, కమిటీ సభ్యులు గాంధీ, జమా, హనుమంతరావు తదితరులు వెంకయ్యనాయుడి సేవలను కొనియాడారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement