శ్రీ రెడ్డిని చూస్తే జాలేస్తోంది: లారెన్స్‌

Raghava Lawrence Again Slams Sri Reddy - Sakshi

నటి శ్రీ రెడ్డి చేస్తున్న ఆరోపణలపై కొరియోగ్రాఫర్‌ కమ్‌ హీరో‍ రాఘవ లారెన్స్‌ స్పందించారు. గత కొంత కాలంగా తమిళ సినీ ప్రముఖులను లక్ష్యంగా చేసుకుని శ్రీ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో లారెన్స్‌పైనా ఆరోపణలు చేయగా.. ఆయన ఖండించారు. తాజాగా ట్విటర్‌లో ఆయన మరోసారి స్పందించారు. ‘శ్రీరెడ్డి ఆరోపణల తర్వాత నాకు చాలా మంది నుంచి ఫోన్‌కాల్స్ వచ్చాయి. ఆమెతో వివాదం గురించి అడుగుతున్నారు. దాంతో ఆమెతో ఉన్న వివాదానికి ముగింపు పలకాలని అనుకొంటున్నాను’ అని రాఘవ ట్వీట్‌లో పేర్కొన్నారు.

ట్వీట్‌లో ఏముందంటే.. ‘తెలుగులో రెబెల్ సినిమా షూటింగ్ సమయంలో శ్రీ రెడ్డి నన్ను కలిసింది. ఆ మూవీ పూర్తై ఇప్పటికీ 7 ఏళ్లు గడిచిపోయింది. అప్పటి నుంచి నాపై ఈ ఆరోపణలను ఆమె ఎందుకు చేయలేదు?.. హోటల్ రూమ్‌లో కలిసి తనతో అసభ్యంగా ప్రవర్తించానని అంది. అలాగే నా హోటల్ రూంలో రుద్రక్షమాల, దేవుడి ఫొటోలు చూశానని చెప్పింది. హోటల్లో రుద్రాక్ష మాలా ఉంచుకోవడం, పూజాలు చేయడానికి నేనేమైనా పిచ్చివాడినా? అని ఆయన పేర్కొన్నారు.

శ్రీ రెడ్డిని చూస్తే జాలేస్తోంది:
... ‘శ్రీ రెడ్డి పరిస్థితి చూస్తే జాలేస్తోంది. ఇప్పటికీ నా సినిమాలో అవకాశం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా. అందుకు ఓ ప్రెస్‌మీట్ పెడతాను. మీడియా ముందు ఓ కార్యెక్టర్, సీన్ పేపర్ ఇస్తాను. యాక్టింగ్‌తోపాటు కొన్ని స్టెప్పులు నాతోపాటు వేసి చూపించు. అలాగని నేను నీకు కష్టమైన స్టెప్పులు ఇవ్వను. సింపుల్ స్టెప్స్ మాత్రమే ఇస్తాను. నీలో నటనలో బేసిక్స్, టాలెంట్ ఉందని భావిస్తే వెంటనే నా నెక్స్ట్‌ మూవీలో ఛాన్స్‌ ఇస్తా. అడ్వాన్స్‌ కూడా వెంటనే ఇచ్చేస్తా. నా సినిమాలో నటిస్తే తర్వాత నీకు మరిన్ని ఆఫర్లు వచ్చే అవకాశం ఉంటుంది. ఒకవేళ ప్రెస్‌మీట్‌లో నీకు అందరి ముందు నటించడానికి ఇష్టం లేకపోతే నా మేనేజర్‌ను క్లవండి. మీతోపాటు లాయర్‌ను లేదా మీ సన్నిహితులు ఎవరినైనా తెచ్చుకొండి. మీ టాలెంట్‌ను నిరూపించుకోండి. నేను మీకు ఎలాంటి సహాయమైనా చేయడానికి సిద్ధం’ అని శ్రీ రెడ్డికి కౌంటర్‌ ఇచ్చారు. 

శ్రీ రెడ్డి చేసిన ఆరోపణలకు భయపడి తాను ఈ సమాధానం ఇవ్వడం లేదని.. మహిళలను గౌరవిస్తాను కాబట్టే ఆ మచ్చను తొలగించుకునేందుకే ఈ వివరణ ఇస్తున్నానని ఆయన చెప్పుకొచ్చారు. తల్లి కోసం గుడి కట్టిన నేను మహిళల పట్ల ఎప్పుడూ గౌరవంగా మెదులుతానని.. మంచి చేయటం. మాట్లాడటం మాత్రమే తనకు తెలుసని ఆయన అన్నారు. శ్రీ రెడ్డి జీవితం బాగుండాలని దేవుడిని ప్రార్థిస్తున్నాను’ అని లారెన్స్ చెప్పుకొచ్చారు. కాగా, టాలీవుడ్‌ తర్వాత కోలీవుడ్‌లో క్యాస్టింగ్ కౌచ్‌పై ఉద్యమిస్తున్నట్టు చెప్పుకొంటున్న శ్రీరెడ్డి ఇటీవల కాలంలో ప్రముఖులపై ఘాటైన వ్యాఖ్యలతో పోస్టులు పెడుతున్నారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top