సిన్సియర్ లవర్ కథ | Pyar Mein Padipoya Platinum Disc Function | Sakshi
Sakshi News home page

సిన్సియర్ లవర్ కథ

May 3 2014 11:02 PM | Updated on Sep 2 2017 6:53 AM

సిన్సియర్ లవర్ కథ

సిన్సియర్ లవర్ కథ

‘‘చాలా సిన్సియర్‌గా ప్రేమించే కుర్రాడి కథ ఇది. తానొక వేళ ప్రేమలో ఫెయిలైనా హార్ట్ బ్రేక్ చేసుకోడు. ఆత్మహత్యకు సిద్ధపడడు. ఇందులో నాది అలాంటి పాత్ర’’

‘‘చాలా సిన్సియర్‌గా ప్రేమించే కుర్రాడి కథ ఇది. తానొక వేళ ప్రేమలో ఫెయిలైనా హార్ట్ బ్రేక్ చేసుకోడు. ఆత్మహత్యకు సిద్ధపడడు. ఇందులో నాది అలాంటి పాత్ర’’ అని హీరో ఆది చెప్పాడు. ఆది,  శాన్వి జంటగా రవి చావలి దర్శకత్వంలో కె.కె.రాధామోహన్ నిర్మించిన ‘ప్యార్ మే పడిపోయానె’ ప్లాటినమ్ డిస్క్ వేడుక శనివారం సాయంత్రం హైదరాబాద్‌లో జరిగింది. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ- ‘‘టెన్షన్ కామెడీతో సినిమా నడుస్తుంది. ప్రేక్షకుల ఊహకు భిన్నంగా సన్నివేశాలు ఉంటాయి’’ అన్నారు. అనూప్ స్వరాలందించిన పాటలకు మంచి స్పందన లభిస్తోందని, త్వరలోనే ఈ చిత్రాన్ని విడుదల చేస్తామని నిర్మాత తెలిపారు.
 

Advertisement
 
Advertisement
Advertisement