కొత్త హీరో... కొత్త డైరెక్టర్‌ | Producer Raj Kandukuri starts new movie | Sakshi
Sakshi News home page

కొత్త హీరో... కొత్త డైరెక్టర్‌

Jan 9 2019 12:51 AM | Updated on Jan 9 2019 12:51 AM

Producer Raj Kandukuri starts new movie - Sakshi

‘పెళ్ళి చూపులు, మెంటల్‌ మదిలో’ వంటి చిత్రాలని నిర్మించడంతో పాటు జాతీయ, ఫిల్మ్‌ ఫేర్‌ అవార్డులని సొంతం చేసుకున్న నిర్మాత రాజ్‌ కందుకూరి. ఇప్పుడు ఆయన తన కుమారుడు శివ కందుకూరిని హీరోగా పరిచయం చేస్తున్నారు. అమెరికాలో చదువు పూర్తి చేసుకుని ఈ మధ్యే ఇండియాకి వచ్చారు శివ. ధర్మపథ క్రియేషన్స్‌పై రూపొందనున్న ఈ చిత్రంతో శేష సింధురావ్‌ అనే లేడీ డైరెక్టర్‌ని సినిమా రంగానికి పరిచయం చేస్తున్నారు రాజ్‌ కందుకూరి.

దర్శకులు సుకుమార్, క్రిష్‌ల వద్ద అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పని చేశారు శేష సింధురావ్‌. ఈ చిత్రానికి గోపీ సుందర్‌ సంగీతం అందిస్తున్నారు. తమిళంలో ఇటీవల విడుదలై ఘన విజయం సాధించిన ‘96’ చిత్రం ఫేమ్‌ వర్ష ఇందులో కథానాయికగా నటిస్తున్నారు. ‘మహానటి’ చిత్రానికి స్క్రీన్‌ప్లే, మాటలు అందించిన పద్మావతి విశ్వేశ్వర్‌ ఈ చిత్రానికి దర్శకురాలితో కలిసి కథ, స్క్రీన్‌ ప్లే, మాటలు అందించారు. ఈ చిత్రానికి సమర్పణ: దగ్గుబాటి సురేశ్‌ బాబు, ‘మధుర’ శ్రీధర్, కెమెరా: వేద వర్మ. 

Advertisement
 
Advertisement
Advertisement