
చెన్నై: ప్రముఖ నిర్మాత, ఆదిత్యరామ్ స్టూడియోస్ అధినేత ఆదిత్యరామ్ ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. ఆయన తల్లి పి లక్ష్మీ ఆదివారం చెన్నైలో తుదిశ్వాస విడిచారు. ఆదిత్యరామ్ సందడే సందడి, ఖుషి ఖుషీగా, స్వాగతం, ఏక్ నిరంజన్ సినిమాలను నిర్మించారు. ఆయన ఆదిత్యరామ్ గ్రూప్ కంపెనీలకు అధినేతగా వ్యవహరిస్తున్నారు. లక్ష్మీ మృతిపై పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు. కాగా, ఆమె అంత్యక్రియలు చెన్నైలోని ఆదిత్యరామ్ నగర్‌లో ఆదివారం సాయంత్రం జరగనున్నాయి.