‘నన్ను అవమానాలకు గురిచేశారు’

Priyanka Bose Comments Over Outed Sajid Khan In Her MeToo Story - Sakshi

‘ఆ చేదు అనుభవాల నుంచి నేను నుంచి పూర్తిగా బయటపడ్డాను. అతడికే జీవితం కాస్త మారి ఉంటుంది. మనచుట్టూ ఎంతోమంది నేరగాళ్లు, మోసగాళ్లు ఉంటారు. లైంగిక వేధింపులపై గళం విప్పినప్పుడు ఎంతో మంది నా క్యారెక్టర్‌ను ఇష్టం వచ్చినట్లుగా జడ్జ్‌ చేశారు. అవమానాలకు గురిచేశారు. అప్పుడు కాస్త బాధ పడ్డాను. కానీ ఇప్పుడు అలా కుంగిపోయే ప్రసక్తే లేదు. నాకు ఎదురైన వేధింపుల గురించి బయటపెట్టడం ద్వారా ఇప్పుడు ప్రశాంతంగా ఉన్నాను. అయితే అందరూ నాలాగా ఉండాలని ఆశించకూడదు కదా’ అని బాలీవుడ్‌ నటి ప్రియాంక బోస్‌ తన అనుభవాల గురించి చెప్పుకొచ్చారు. బాలీవుడ్‌ దర్శకుడు సాజిద్‌ ఖాన్‌ తనను లైంగికంగా వేధించారంటూ ప్రియాంక బోస్‌ మీటూ స్టోరిని బహిర్గతం చేసిన సంగతి తెలిసిందే.

కాగా ప్రియాంక బోస్‌ ప్రస్తుతం.. ప్రకాశ్‌ ఝా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పరీక్షతో పాటు మేఘా రామస్వామి ద ఆడ్స్‌ సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో పరీక్ష గురించి మాట్లాడుతూ.. ‘ ఓ రిక్షావాలా కుటుంబం కథ ఇది. కొడుకును ఇంగ్లీష్‌ మీడియంలో చదివించాలనుకునే తల్లిదండ్రులు పడే వేదనే పరీక్ష. ఇటువంటి సినిమాలో నటించడం ద్వారా నటిగా ఓ మెట్టు ఎక్కినట్టు భావిస్తున్నా అని ప్రియాంక చెప్పుకొచ్చారు. లైంగిక వేధింపుల ఆరోపణల కారణంగా మీ జీవితంలో ఎటువంటి మార్పులు చోటుచేసుకున్నాయని ప్రశ్నించగా ఆమె పైవిధంగా స్పందించారు.  ఇక సాజిద్‌ ఖాన్‌పై నటి సలోని చోప్రాతో పాటు ప్రియాంక బోస్‌, మందనా కరిమి, రేచల్‌ వైట్‌ వంటి పలువురు మహిళలు లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇండియన్‌ ఫిల్మ్‌ అండ్‌ టెలివిజన్‌ డైరెక్టర్స్‌ అసోసియేషన్‌ అతడిపై ఏడాది పాటు నిషేధం విధించింది.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top