జోడీ కుదిరిందా? | Priyamani cast opposite Venkatesh in Telugu remake of Asuran | Sakshi
Sakshi News home page

జోడీ కుదిరిందా?

Jan 3 2020 2:14 AM | Updated on Jan 3 2020 2:14 AM

Priyamani cast opposite Venkatesh in Telugu remake of Asuran - Sakshi

వెంకటేష్‌, ప్రియమణి

వెంకటేష్‌ హీరోగా శ్రీకాంత్‌ అడ్డాల దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. తమిళంలో ధనుష్, మంజువారియర్‌ నటించిన సూపర్‌హిట్‌ మూవీ ‘అసురన్‌’కు ఇది తెలుగు రీమేక్‌. ఈ చిత్రాన్ని డి.సురేష్‌బాబు, కళైపులి యస్‌. థాను నిర్మించనున్నారు. ఈ సినిమా చిత్రీకరణ ఈ నెలలో ప్రారంభం కానుందని తెలిసింది.

అయితే తమిళంలో మంజు వారియర్‌ పోషించిన పాత్రకు తెలుగు రీమేక్‌లో ప్రియమణిని తీసుకోవాలనుకుంటున్నారట. ఇటీవల ప్రియమణిని సంప్రదించారని టాక్‌. మరి.. వెంకీ, ప్రియమణి జోడి కుదురుతుందా? వెయిట్‌ అండ్‌ సీ. ఇదిలా ఉంటే 2016లో ‘మన ఊరి రామాయణం’లో కనిపించిన తర్వాత ప్రియమణి తెలుగు తెరపై కనిపించలేదు. ప్రస్తుతం దివంగత నటి, మాజీ తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత జీవితం ఆధారంగా తమిళంలో రూపొందుతోన్న ‘తలైవి’లో శశికళ పాత్ర చేస్తున్నారు. ఇది కాకుండా కన్నడ, మలయాళ చిత్రాలు చేస్తున్నారు ప్రియమణి.

Advertisement
 
Advertisement
Advertisement