వాస్తవ సంఘటనల ఆధారంగా ప్రేమంటేనే చిత్రం | Premantene Chitram Movie Based on Real Incidents | Sakshi
Sakshi News home page

వాస్తవ సంఘటనల ఆధారంగా ప్రేమంటేనే చిత్రం

Oct 28 2013 12:27 AM | Updated on Sep 2 2017 12:02 AM

వాస్తవ సంఘటనల ఆధారంగా ప్రేమంటేనే చిత్రం

వాస్తవ సంఘటనల ఆధారంగా ప్రేమంటేనే చిత్రం

మానస్, ఆరుషి జంటగా గునపాటి సురేష్‌రెడ్డి సమర్పణలో గంగవరపు శ్రీనివాసులునాయుడు, జీవీ నరసయ్య, కృత్య సంయుక్తంగా నిర్మించిన చిత్రం ‘ప్రేమంటేనే చిత్రం’.

మానస్, ఆరుషి జంటగా గునపాటి సురేష్‌రెడ్డి సమర్పణలో గంగవరపు శ్రీనివాసులునాయుడు, జీవీ నరసయ్య, కృత్య సంయుక్తంగా నిర్మించిన చిత్రం ‘ప్రేమంటేనే చిత్రం’. వి.ఆర్. దొరైరాజు దర్శకుడు. ఈ చిత్రం పాటలను ఆదివారం పాత్రికేయులకు ప్రదర్శించారు. దర్శకుడు మాట్లాడుతూ - ‘‘దేశంలోని కొన్ని పట్టణాల్లో జరిగిన యథార్థ సంఘటనల ఆధారంగా ఈ చిత్రం చేశాం. ప్రేమ, వినోదం, సందేహం సమాహారంతో రూపొందించిన ఈ చిత్రం అన్ని వర్గాలవారిని ఆకట్టుకునే విధంగా ఉంటుంది’’ అన్నారు. 
 
నవంబర్ 1న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నామని  నిర్మాత శ్రీనివాసులు నాయుడు చెప్పారు. పాటలు విజయం సాధించినట్లుగానే సినిమా కూడా హిట్ అవుతుందనే నమ్మకం ఉందని నరసయ్య తెలిపారు.  మంచి పాత్ర చేశానని ఆరుషి చెప్పారు. ఈ చిత్రంలో దర్శకుడు మంచి పాత్ర ఇచ్చారని, మంచి సినిమా చూసిన అనుభూతి ప్రేక్షకులకు మిగులుతుందని  మానస్ అన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement