టాలీవుడ్‌ లో మరో క్రేజీ మల్టీస్టారర్‌?

Praveen Sattaru Next Multi-starrer Movie - Sakshi

సాక్షి, సినిమా : వైవిధ్యభరితమైన కథలతో ప్రేక్షకులను మెప్పిస్తూ తక్కువ కాలంలోనే మంచి గుర్తింపు పొందాడు దర్శకుడు ప్రవీణ్‌ సత్తారు. రీసెంట్‌గా గరుడవేగ చిత్ర ఘన విజయం సాధించటంతో అతనితో పని చేసేందుకు యువహీరోలు ఉవ్విళ్లూరుతున్నారు. ఈ క్రమంలో తన తర్వాతి చిత్రం ప్రవీణ్‌తో ఉంటుందని స్వయంగా నితిన్‌ ప్రకటించటం చూశాం. అయితే అది మాములు చిత్రం కాదన్న సంకేతాలు ఇప్పుడు అందుతున్నాయి. 

ముగ్గురు యువ హీరోలతో ప్రవీణ్ మల్టీస్టారర్‌ తెరకెక్కించబోతున్నాడని చెబుతున్నాడని ఫిల్మ్‌ నగర్‌లో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. ‘త్రీ కజిన్స్’ టైటిల్‌ తో ఈ చిత్రం రూపుదిద్దుకోబోతుందని టాక్‌. నితిన్‌ ఓ హీరోగా ఇప్పటికే ఎంపిక కాగా, మిగతా ఇద్దరు హీరోలుగా రానా, నారా రోహిత్‌లను తీసుకునే అవకాశం ఉందంట‌. ఒకవేళ అదే జరిగితే మాత్రం ప్రేక్షకులకు మరో క్రేజీ సినిమా అందినట్లే అవుతుంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. ప్రస్తుతం ఈ ముగ్గురు యువహీరోలు తమ తమ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top