ధనుష్‌ కాదు ప్రశాంత్‌! | Prashanth to act in Tamil remake of Andhadhun | Sakshi
Sakshi News home page

ధనుష్‌ కాదు ప్రశాంత్‌!

Aug 17 2019 12:35 AM | Updated on Aug 17 2019 12:35 AM

Prashanth to act in Tamil remake of Andhadhun - Sakshi

ప్రశాంత్‌

శ్రీరామ్‌ రాఘవన్‌ దర్శకత్వంలో ఆయుష్మాన్‌ ఖురానా, రాధికా ఆప్టే, టబు ముఖ్య పాత్రల్లో నటించిన హిందీ బ్లాక్‌బస్టర్‌ చిత్రం ‘అంధాధూన్‌’. ఈ చిత్రం తమిళంలో రీమేక్‌ కాబోతుందని ఆ మధ్య వార్తలు వచ్చాయి. హీరోగా ధనుష్, సిద్ధార్థ్‌ ఇలా పలువురు పేర్లు కూడా వినిపించాయి. ఓ సందర్భంలో ‘అంధాధూన్‌’ చేయాలని చాలా ఆసక్తిగా ఉన్నానని కూడా తెలిపారు ధనుష్‌. ఇప్పుడు ‘అంధాధూన్‌’ తమిళ రీమేక్‌లో ‘జీన్స్‌’ ఫేమ్‌ ప్రశాంత్‌ నటిస్తారని తెలిసింది. ఈ హిందీ చిత్రం తమిళ రైట్స్‌ను ప్రశాంత్‌ తండ్రి, నటుడు–దర్శకుడు–నిర్మాత త్యాగరాజన్‌ సొంతం చేసుకున్నారు. ప్రశాంత్‌ నటించిన గత చిత్రం ‘జానీ’ (తమిళం) కూడా శ్రీరామ్‌ రాఘవన్‌ తెరకెక్కించిన ‘జానీ గద్దర్‌’ (హిందీ)కు రీమేకే కావడం విశేషం.

Advertisement
 
Advertisement
Advertisement