చిన్న గీటు... నాలుగు కుట్లు! | Pragya Jaiswal leg fracture | Sakshi
Sakshi News home page

చిన్న గీటు... నాలుగు కుట్లు!

May 11 2017 10:57 PM | Updated on Sep 5 2017 10:56 AM

చిన్న గీటు... నాలుగు కుట్లు!

చిన్న గీటు... నాలుగు కుట్లు!

సెట్‌లో రిస్కీ ఫైట్స్‌ తీసేటప్పుడు స్టార్స్‌కి ఇంజ్యూరీస్‌ కావడం కామన్‌.

సెట్‌లో రిస్కీ ఫైట్స్‌ తీసేటప్పుడు స్టార్స్‌కి ఇంజ్యూరీస్‌ కావడం కామన్‌. కానీ, రొమాంటిక్‌ సీన్స్‌ చేసేటప్పుడు గాయాలవుతాయా? కాదు కదా! అయితే ప్రగ్యా జైస్వాల్‌కు అయింది. ఎలా అయ్యిందంటే... నడుస్తున్నప్పుడు! గాయం చిన్నదే కానీ, కుట్లే నాలుగు పడ్డాయి.

ఇది జరిగింది మంచు విష్ణుకు జోడీగా నటిస్తున్న ‘ఆచారి అమెరికా యాత్ర’ సెట్‌లో. కాలికి ఏదో గీసుకున్నట్టు ప్రగ్యాకి అనిపించిందట! చూస్తే మెల్లగా రక్తం... డాక్టర్‌ దగ్గరకు వెళితే నాలుగు కుట్లేశారు. దీన్ని సాకుగా చూపించి ప్రగ్యా షూటింగ్‌కి డుమ్మా కొట్టలేదు.

Advertisement
 
Advertisement
Advertisement