ఈ రోజు నాకెప్పటికీ ప్రత్యేకమే : ప్రభాస్‌ | Prabhas Tweet About Baahubali 2 Complete One Year | Sakshi
Sakshi News home page

Apr 28 2018 3:34 PM | Updated on Aug 11 2019 12:52 PM

Prabhas Tweet About Baahubali 2 Complete One Year - Sakshi

యంగ్ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ హీరోగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన విజువల్ వండర్‌ బాహుబలి. రెండు భాగాలుగా రిలీజ్‌ అయిన ఈ సిరీస్‌లో రెండో భాగం రిలీజ్‌ అయిన ఏడాది పూర్తయ్యింది. ఈ సందర్భంగా తన ఆనందాన్ని అభిమానులతో షేర్‌ చేసుకున్నాడు ప్రభాస్‌. ‘మా సినిమా బాహుబలి 2 విడుదలై ఏడాది పూర్తయ్యింది. ఈ రోజు నాకు ఎప్పటికీ ప్రత్యేకమే. నా అందమైన, భావోద్వేగ ప్రయాణంలో భాగమైనందకు కృతజ్ఞతలు. దర్శకుడు రాజమౌళికి, బాహుబలి చిత్రయూనిట్‌ కు నా కృతజ్ఞతలతో పాటు శుభాకాంక్షలు’ అంటూ తన ఫేస్‌బుక్‌ పేజ్‌ లో పోస్ట్ చేశాడు ప్రభాస్‌.

ప్రస్తుతం ప్రభాస్‌ సాహో సినిమా పనుల్లో బిజీగా ఉండగా రాజమౌళి బాహుబలి 2 సినిమాను జపాన్‌లో ప్రమోట్‌ చేసే పనిలో ఉన్నారు. నిర్మాత శోభు యార్లగడ్డతో కలిసి జపాన్‌ పర్యటనలో ఉన్న జక్కన్న అక్కడ మీడియాతో మాట్లాడుతూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. మే 4 బాహుబలి 2ను చైనాలో భారీగా రిలీజ్‌ చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నారు. ప్రభాస్‌, రానా, అనుష్క, రమ్యకృష్ణ, సత్యరాజ్‌, నాజర్‌ లు ఇతర కీలక పాత్రలో నటించిన ఈ సినిమా అంతర్జాతీయ స్థాయిలో కలెక్షన్ల సునామీ సృష్టించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement