ఆ సినిమాలో ప్రభాస్ లేడు | Prabhas Not Part Of Singam 3 | Sakshi
Sakshi News home page

ఆ సినిమాలో ప్రభాస్ లేడు

Oct 4 2016 2:50 PM | Updated on Sep 4 2017 4:09 PM

ఆ సినిమాలో ప్రభాస్ లేడు

ఆ సినిమాలో ప్రభాస్ లేడు

బాహుబలి సినిమాతో ప్రపంచ వ్యాప్త గుర్తింపు తెచ్చుకున్న ప్రభాస్, పలు సినిమాలో అతిథి పాత్రల్లో కనిపించనున్నాడంటూ చాలా రోజులుగా ప్రచారం జరుగుతోంది. బాలీవుడ్ మూవీ యాక్షన్ జాక్సన్లో...

బాహుబలి సినిమాతో ప్రపంచ వ్యాప్త గుర్తింపు తెచ్చుకున్న ప్రభాస్, పలు సినిమాలో అతిథి పాత్రల్లో కనిపించనున్నాడంటూ చాలా రోజులుగా ప్రచారం జరుగుతోంది. బాలీవుడ్ మూవీ యాక్షన్ జాక్సన్లో ప్రభాస్, ఓ చిన్న సీన్లో కనిపించటంతో మరిన్ని సినిమాల్లో కనిపించనున్నాడంటూ టాక్ మొదలైంది. ముఖ్యంగా సూర్య హీరోగా తెరకెక్కుతున్న సింగం 3లో ప్రభాస్ గెస్ట్ అపియరెన్స్ ఇవ్వనున్నాడన్న వార్త టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీగా మారింది.

అయితే ఈ వార్తలపై స్పందించిన నిర్మాత జ్ఞానవేల్ రాజా, ప్రభాస్ సింగం 3లో నటించలేదంటూ క్లారిటీ ఇచ్చాడు. హరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అనుష్క శృతిహాసన్లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రస్తుతం మలేషియాలో షూటింగ్ జరుపుకుంటున్న సింగం 3 డిసెంబర్ 16న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement