ఇస్రో ప్రయోగం గర్వకారణం: ప్రభాస్‌ | Prabhas Appreciate ISRO On The Success Of Chandrayaan 2 Mission | Sakshi
Sakshi News home page

ఇస్రో ప్రయోగం గర్వకారణం: ప్రభాస్‌

Jul 23 2019 2:55 PM | Updated on Jul 23 2019 4:25 PM

Prabhas Appreciate ISRO On The Success Of Chandrayaan 2 Mission - Sakshi

చంద్రయాన్‌-2 ప్రయోగాన్ని విజయవంతం చేసిన ఇస్రో.. అంతరిక్ష ప్రయోగాలలో దేశ ఖ్యాతిని ప్రపంచానికి మరోసారి పరిచయం చేసింది. సోమవారం సగర్వంగా ‘చంద్రయాన్‌–2’ రాకెట్‌ నింగిలోకి దూసుకెళ్లిన విషయం తెలిసిందే. దీంతో ప్రపంచంలోనే చంద్రునిపై రాకెట్‌ను ప్రవేశపెట్టిన దేశాలలో భారత్‌  నాలుగవ స్థానంలో నిలిచింది. మొదటి మూడు స్థానాలలో వరుసగా అమెరికా, రష్యా, చైనా ఉన్నాయి. 

ఈ ప్రయోగం సక్సెస్‌పై టాలీవుడ్‌ యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ స్పందించారు. బాహుబలి సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన ప్రభాస్‌.. చంద్రయాన్‌–2కు తన సినిమా ‘బాహుబలి’ పేరు పెట్టడం గర్వంగా ఉందన్నారు. ప్రయోగంపై ఆనందం వ్యక్తం చేస్తూ, ఆయన తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశారు. చంద్రయాన్‌-2 మిషన్‌ విజయం దేశానికే గర్వకారణమని, ఈ ప్రయోగంతో  దేశశక్తిని మరోసారి ప్రపంచానికి చూపించామని పేర్కొన్నారు. కొన్ని సంవత్సరాల కృషికి  ఫలితం దక్కిందని, నేడు ప్రతి భారతీయ పౌరుడు గర్వించదగ్గ రోజని కొనియాడారు. ప్రభాస్‌ నటించిన భారీ బడ్జెట్‌ సినిమా ‘సాహో’ విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమాతో బాలీవుడ్‌ భామ శ్రద్ధా కపూర్‌ తొలిసారి తెలుగు తెరపై కనిపించనున్నారు. ఈ సినిమాను మొదట ఆగష్టు 15న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని  సాహో టీం నిర్ణయించినప్పటికీ,  ప్రొడక్షన్‌ పనులు పూర్తి కాకపోవడంతో ఆగష్టు 30వ తేదీకి వాయిదా వేశారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement