
సెట్స్‌లో...రాయుడు
తెల్లచొక్కా.. తెల్లపంచె.. నున్నగా గీసిన గడ్డం.. ఫ్యాక్షనిస్ట్‌గా పవన్ కల్యాణ్ లుక్ ఎలా ఉండబోతుందో! ఫస్ట్ లుక్ విడుదలకు
తెల్లచొక్కా.. తెల్లపంచె.. నున్నగా గీసిన గడ్డం.. ఫ్యాక్షనిస్ట్‌గా పవన్ కల్యాణ్ లుక్ ఎలా ఉండబోతుందో! ఫస్ట్ లుక్ విడుదలకు మందే నిర్మాత శరత్ మరార్ ప్రేక్షకులకు చూపించేశారు. ‘సర్దార్ గబ్బర్ సింగ్’ తర్వాత పవన్ కల్యాణ్ హీరోగా నటిస్తున్న సినిమా ‘కాటమరాయుడు’. ‘గోపాల గోపాల’ ఫేమ్ కిశోర్‌కుమార్ పార్థసాని (డాలీ) దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ గత వారం ప్రారంభమైన సంగతి తెలిసిందే. సుమారు పదిరోజులుగా బెంగళూరు జిమ్‌లో ఫిట్‌నెస్‌పై దృష్టి సారించిన పవన్.. సోమవారం ‘కాటమరాయుడు’ సెట్స్‌లోకి అడుగుపెట్టారు.
అప్పుడు తీసిన ఫొటోను నిర్మాత శరత్ మరార్ ట్వీట్ చేశారు. ‘గబ్బర్ సింగ్’లో పవన్‌తో తొలిసారి జోడీ కట్టిన శ్రుతీ హాసన్, ఈ సినిమాలో రెండోసారి నటించనున్నారు. ఫ్యాక్షనిస్ట్‌గా ప్రేమకథగా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో కమల్ కామరాజు, మానస హిమవర్షి తదితరులు నటిస్తున్నారు. మధ్య మధ్యలో కొంత విరామం తీసుకుంటూ వీలైనంత త్వరగా షూటింగ్ పూర్తి చేయాలని ప్లాన్ చేశారట. ఈ చిత్రానికి కెమేరా: ప్రసాద్ మూరెళ్ల, సంగీతం: అనూప్ రూబెన్స్.