పవర్‌ ఆఫ్‌ రిలేషన్‌షిప్‌ | Power of Relationship | Sakshi
Sakshi News home page

పవర్‌ ఆఫ్‌ రిలేషన్‌షిప్‌

Feb 8 2017 11:52 PM | Updated on Sep 5 2017 3:14 AM

పవర్‌ ఆఫ్‌ రిలేషన్‌షిప్‌

పవర్‌ ఆఫ్‌ రిలేషన్‌షిప్‌

అలీ రెజా, సీతానారాయణన్‌ జంటగా ఎన్‌.లక్ష్మి నంద దర్శకత్వంలో మువ్వ సత్యనారాయణ నిర్మించిన చిత్రం ‘రామ్‌ – ఎన్‌.ఆర్‌.ఐ’.

అలీ రెజా, సీతానారాయణన్‌ జంటగా ఎన్‌.లక్ష్మి నంద దర్శకత్వంలో మువ్వ సత్యనారాయణ నిర్మించిన చిత్రం ‘రామ్‌ – ఎన్‌.ఆర్‌.ఐ’. పవర్‌ ఆఫ్‌ రిలేషన్‌షిప్‌.. అన్నది ఉపశీర్షిక. ఈ సినిమా టీజర్‌ను హైదరాబాద్‌లో విడుదల చేశారు. దర్శక– నిర్మాతలు మాట్లాడుతూ – ‘‘మా ఇద్దరికీ ఇది తొలి చిత్రం. ఈ సినిమాలో కుటుంబ విలువలకు ప్రాధాన్యం ఇచ్చాం. సామాజిక స్పృహతో మంచి మెసేజ్‌తో పాటు కమర్షియల్‌ ఎలిమెంట్స్‌ను జోడించాం. అన్ని వర్గాల ప్రేక్షకులకు నచే ్చలా ఉంటుంది. పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు పూర్తయ్యాయి. త్వరలో సినిమా విడుదల చేస్తాం’’ అన్నారు. జూబ్లీహిల్స్‌ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, నిర్మాతలు టి. ప్రసన్నకుమార్, సాయివెంకట్, మేకా రమేష్, నటీనటులు విజయ్‌చందర్, గీతాంజలి తదితరులు పాల్గొన్నారు. ఈ చిత్రానికి సంగీతం: శ్రావణ్, కెమెరా: నాగబాబు కర్ర.
 

Advertisement
 
Advertisement
Advertisement