అవి రియాలిటీ షోలు కాదు... : పోసాని | Posani Krishna Murali's controversial comments on Reality Shows | Sakshi
Sakshi News home page

టీవీ షోలపై బాంబు పేల్చిన పోసాని!

Jul 16 2017 9:11 AM | Updated on Sep 18 2018 8:13 PM

అవి రియాలిటీ షోలు కాదు... : పోసాని - Sakshi

అవి రియాలిటీ షోలు కాదు... : పోసాని

తెలుగు టీవీ ఛానెల్స్‌లో వచ్చే రియాలిటీ షోలు అన్నీ నిజం కాదని ప్రముఖ సినీనటుడు పోసాని కృష్ణమురళి తెలిపారు.

  • ఆ టీవీ షోల్లో నకిలీ కేసులు
  • భార్యాభర్తలను కొట్టుకోమని నిర్వాహకులే చెప్తారు
  • కొన్నిసార్లు నకిలీ జంటలతోనూ షో నడిపిస్తారు
  • కుండబద్దలు కొట్టిన పోసాని కృష్ణమురళి
     
  • సాక్షి, హైదరాబాద్‌: తెలుగు టీవీ ఛానెల్స్‌లో వచ్చే రియాలిటీ షోలు అన్నీ నిజం కాదని ప్రముఖ సినీనటుడు పోసాని కృష్ణమురళి తెలిపారు. పలు తెలుగు టీవీ ఛానల్స్‌లో విడిపోయిన భార్యభర్తలను కలిపే కార్యక్రమాలు, కుంటుబం సమస్యలను పరిష్కరించే కార్యక్రమాలు తరచూగా చూస్తూనే ఉంటాం. ఈ కార్యక్రమాల్లో భార్య భర్తల మధ్య తలెత్తిన వైవాహిక సమస్యలను పరిష్కారం చూపిస్తాయి. ఒక్కో సారీ ఈ కార్యక్రమానికి వచ్చిన జంటలు రెచ్చిపోతాయి. భార్యను భర్త కొట్టడమో,  భర్తను భార్య కొట్టడమో, కుటుంబం సభ్యులు కొట్టుకోవడమో జరుగుతుంది. వీటన్నింటిపై ఓప్రముఖ తెలుగు ఛానెల్‌లో వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న సినీ నటుడు పోసాని కృష్ణమురళి స్పందించారు.

    ఈ కార్యక్రమాలు అన్నీ నిజం కాదని కొన్ని నకిలీ కేసులు ఉంటాయన్నారు. భార్యభర్తలను కొట్టుకోమని కార్యక్రమ నిర్వాహకులే సూచిస్తారని తెలిపారు. అన్నీరోజులు జంటలు రారని, అలాంటి సమయంలో నిర్వాహకులే నకిలీ జంటలను ఏర్పాటు చేసి కార్యక్రమాన్ని నడిపిస్తారని చెప్పారు. అన్నీ కార్యక్రమాల్లో తన కార్యక్రమానికే పేరొచ్చిందని తెలిపారు. తాను మాత్రం అలాంటి నకిలీ జంటలతో కార్యక్రమాన్ని చేయనని నిర్మాతలకు చెప్పానని, తనకు నిజం అనిపిస్తేనే షో చేస్తానని పేర్కొన్నారు.  నిర్వాహకులు ముందుగానే ఒక్కొక్క షోలో ఒక్కొక్కరికి అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటారని, దాని ప్రకారమే షో నడుస్తుందని అన్నారు. తాను ఒక్కరోజు షూటింగ్‌కు రూ. 3.45లక్షలు తీసుకుంటానని వారం చివరి రోజుల్లో తన ఖాతాలో జమచేస్తారని పోసాని చెప్పారు. ఒక్కసారి తన రెమ్యునరేషన్‌లో కొంత మొత్తాన్ని కార్యక్రమానికి వచ్చిన నిజమైన జంటలను ఆదుకోవడానికి అందించినట్లు ఆయన తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement