కిడ్నాప్‌ కామెడీ!

posani key role new movie

పోసాని కృష్ణమురళి, బ్రహ్మానందం ముఖ్యతారలుగా శ్రీకర్‌బాబు దర్శకత్వంలో దగ్గుబాటి వరుణ్‌ సమర్పణలో మాధవి అద్దంకి నిర్మించిన ‘నేను కిడ్నాప్‌ అయ్యాను’ ఈ శుక్రవారం విడుదల కానుంది. నిర్మాత మాట్లాడుతూ– ‘‘వినోదాత్మకంగా తెరకెక్కిన చిత్రమిది. బ్రహ్మానందం, పోసాని, తాగుబోతు రమేశ్, రఘుబాబు, కృష్ణ భగవాన్, పృథ్విల మధ్య వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తాయి’’ అన్నారు.

‘‘అవుట్‌పుట్‌ బాగా వచ్చింది. మా చిత్రానికి క్లీన్‌ యూ సర్టిఫికెట్‌ రావటం సంతోషంగా ఉంది. ప్రముఖ డిస్ట్రిబ్యూటర్స్‌ మమ్మల్ని సంప్రదిస్తుండటం మా సినిమా విజయంపై ధీమా పెరిగింది’’ అన్నారు శ్రీకర్‌బాబు. ఈ చిత్రానికి సంగీతం: శ్రీకాంత్‌.

Back to Top