
పేద కళాకారులకు ‘మా’ సాయం
‘‘పేద కళాకారులకు సహాయం అందించేలా చర్యలు తీసుకుంటున్నాం. అందులో భాగంగా ‘మా’ అసోసియేషన్ పక్షాన వెల్ఫేర్,
‘‘పేద కళాకారులకు సహాయం అందించేలా చర్యలు తీసుకుంటున్నాం. అందులో భాగంగా ‘మా’ అసోసియేషన్ పక్షాన వెల్ఫేర్, విజిలెన్స్ అనే రెండు కమిటీలు ఏర్పాటు చేశాం’’ అని మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్(మా) అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్ తెలిపారు. అందులో భాగంగా ‘వేదం’, ‘అయ్యారే’ చిత్రాల్లో నటించిన నటుడు నాగయ్య ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాడని తెలిసి, ‘మా’ సభ్యుడు కాకపోయినా నాగయ్యకూ, ఒకప్పటి ‘లవకుశ’ చిత్రంలో కుశుడి పాత్రను పోషించిన నాగసుబ్రహ్మణ్యానికీ ఒక్కొక్కరికీ పాతిక వేలు చొప్పున శుక్రవారం నాడు ‘మా’ పక్షాన అందజేశారు. ఈ సందర్భంగా హైద రాబాద్‌లో ఓ సమావేశం జరిగింది.
‘‘విజిలెన్స్ కమిటీ చైర్మన్‌గా కాదంబరి కిరణ్‌ను, వెల్ఫేర్ కమిటీ అధ్యక్షునిగా సీనియర్ నరేశ్‌లనుఎంపిక చేశాం. వీలైనంత మందిని ‘మా’లో చేర్పించే బాధ్యత కిరణ్ చూసుకుంటారు’’ అని నటుడు రాజేంద్రప్రసాద్ చెప్పారు. సెక్రటరీ శివాజీ రాజా మాట్లాడుతూ,‘‘రెండు నెలలుగా సేవా కార్యక్రమాలు చేస్తున్నాం’’ అని చెప్పారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నటుడు నరేశ్, తదితర ‘మా’ సభ్యులు పాల్గొన్నారు.