‘దేవదాసు’ రోజులు గుర్తొచ్చాయి... | Pawanism Song added in "Rey" Y.V.S | Sakshi
Sakshi News home page

‘దేవదాసు’ రోజులు గుర్తొచ్చాయి...

Mar 31 2015 10:58 PM | Updated on May 28 2018 2:13 PM

‘దేవదాసు’ రోజులు గుర్తొచ్చాయి... - Sakshi

‘దేవదాసు’ రోజులు గుర్తొచ్చాయి...

‘రేయ్’ సినిమాకు వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే నా ‘దేవదాసు’ సినిమా రోజులు గుర్తొచ్చాయి. మా క ష్టాన్ని గుర్తించిన

‘‘ ‘రేయ్’ సినిమాకు వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే నా ‘దేవదాసు’ సినిమా రోజులు గుర్తొచ్చాయి. మా క ష్టాన్ని గుర్తించిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ‘పవనిజం’ సాంగ్‌ను సెన్సార్ చేసి త్వరలోనే సినిమాకు జత చేస్తాం’’ అని వైవీయస్ చౌదరి తెలిపారు. సాయిధరమ్‌తేజ్, సయామీ ఖేర్, శ్రద్ధాదాస్ ముఖ్యతారలుగా బొమ్మరిల్లువారి పతాకంపై వైవీయస్ చౌదరి స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ‘రేయ్’ ఇటీవల విడుద లైంది. ఈ సినిమా సక్సెస్ మీట్ హైదరాబాద్‌లో జరిగింది. ఈ సందర్భంగా సాయిధరమ్‌తేజ్ మాట్లాడుతూ -‘‘ఈ చిత్రానికి అన్ని ఏరియాల నుంచి మంచి స్పందన లభిస్తోంది. దీనికి కారణం వైవియస్ చౌదరిగారు. ఆయన కృషి, పట్టుదల కారణంగానే సినిమా ఇంత ఘన విజయం సాధించింది’’ అని చెప్పారు. ఈ కార్యక్రమంలో గీత రచయిత చంద్రబోస్, నోయెల్, జానీ మాస్టర్, శ్రీధర్ సీపాన, మణికిరణ్, హరీష్, మధుసూదన్ తదితరులు
పాల్గొన్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement