మరోసారి కెవ్వుకేక పెట్టిస్తున్నాడు..! | pawan kalyan sardar gabbarsingh movie update | Sakshi
Sakshi News home page

మరోసారి కెవ్వుకేక పెట్టిస్తున్నాడు..!

Oct 3 2015 8:31 AM | Updated on Jul 6 2019 4:09 PM

మరోసారి కెవ్వుకేక పెట్టిస్తున్నాడు..! - Sakshi

మరోసారి కెవ్వుకేక పెట్టిస్తున్నాడు..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా సర్థార్ గబ్బర్సింగ్. చాలా రోజులుగా వాయిదా పడుతూ వచ్చిన ఈ సినిమా ఈ మధ్యే పట్టాలెక్కింది.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా సర్దార్ గబ్బర్సింగ్. చాలా రోజులుగా వాయిదా పడుతూ వచ్చిన ఈ సినిమా ఈ మధ్యే పట్టాలెక్కింది. పవర్ ఫేం బాబీ దర్శకత్వంలో పక్కా మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. పవన్ పుట్టిన రోజున ఫస్ట్ లుక్ టీజర్ను రిలీజ్ చేసిన చిత్రయూనిట్ ఆ తరువాత మీడియాకు దూరంగా ఉంటూ వస్తున్నారు. దీంతో సినిమాకు సంబంధించి రకరకాల వార్తలు టాలీవుడ్ సర్కిల్స్ లో హల్చల్ చేస్తున్నాయి.

ఈ గాసిప్స్ అన్నింటికి ఫుల్స్టాప్ పెట్టేసింది హాట్ బ్యూటీ లక్ష్మీరాయ్. సర్దార్ గబ్బర్సింగ్ సినిమాలో స్పెషల్ సాంగ్లో నటిస్తున్న ఈ బ్యూటీ, తాను పవన్తో కలిసి దిగిన ఫోటోలు తన ట్విట్టర్ పేజిలో పోస్ట్ చేసింది. దీంతో పవర్ స్టార్ అభిమానులు పండగ చేసుకుంటున్నారు. గబ్బర్సింగ్ సినిమాలోని కెవ్వుకేక పాటను గుర్తు చేసేలా ఉన్నాయి ఈ స్టిల్స్.

ఎన్నో వివాదాల తరువాత షూటింగ్ మొదలైన సర్దార్ గబ్బర్సింగ్ సినిమాను పవన్ మిత్రుడు శరత్ మరార్, పవర్స్టార్తో కలిసి నిర్మిస్తున్నాడు.ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటిస్తోంది. కథా కథనాలు పవన్ కళ్యాణ్ అందిస్తుండటం మరో విశేషం.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement