తదుపరి సూర్య చిత్రమే | pa.ranjith direction with surya! | Sakshi
Sakshi News home page

తదుపరి సూర్య చిత్రమే

Jun 28 2016 3:16 AM | Updated on Sep 4 2017 3:33 AM

తదుపరి సూర్య చిత్రమే

తదుపరి సూర్య చిత్రమే

తదుపరి సూర్య చిత్రానికి సిద్ధం అవుతున్నట్లు దర్శకుడు రంజిత్ తెలిపారు. కబాలి చిత్రంతో పెద్ద దర్శకుల వరుసలో చేరిపోయిన...

తదుపరి సూర్య చిత్రానికి సిద్ధం అవుతున్నట్లు దర్శకుడు రంజిత్ తెలిపారు. కబాలి చిత్రంతో పెద్ద దర్శకుల వరుసలో చేరిపోయిన దర్శకుడు రంజిత్. అట్టకత్తి అనే చిన్న చిత్రంతో పరిచయమై మంచి విజయాన్ని అందుకున్న ఈ యువ దర్శకడికి నటుడు కార్తీ మెడ్రాస్ చిత్రానికి దర్శకుడిగా అవకాశం ఇచ్చి ఆయన స్థాయిని మరింత పెంచారు. ఆ చిత్రం విజయంతో సూర్య రంజిత్‌కు మరో అవకాశం ఇవ్వడానికి ముందుకొచ్చారు. ఈ చిత్రాన్ని స్టూడియో గ్రీన్ సంస్థ నిర్మించడానికి రెడీ అయ్యింది.

సరిగ్గా అలాంటి పరిస్థితిలో రంజిత్‌కు సూపర్‌స్టార్‌ను దర్శకత్వం వహించే బిగ్ అవకాశం వరించింది. దీంతో అందివచ్చిన అవకాశాన్ని గప్పున పుచ్చుకుని కబాలి చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్రంపై అంచనాలు తారస్థాయికి చేరుకున్నాయి. రంజిత్‌ను ఉన్నత స్థాయిలో కూర్చోబెట్టాయి. కబాలి చిత్రం వచ్చే నెల 15న ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదలకు సిద్ధం అవుతోంది. కాగా రంజిత్ తదుపరి చిత్రం ఏమిటన్న ప్రశ్నకు కబాలి తెలుగు వెర్షన్ ఆడియో ఆవిష్కరణ కార్యక్రమంలో ఆయన క్లారిఫై ఇచ్చారు.

తదుపరి చిత్రాన్ని సూర్య హీరోగా రూపొందించనున్నట్లు రంజిత్ స్పష్టం చేశారు. 24 చిత్ర విజయాన్ని ఆస్వాదిస్తూ ఎస్-3 చిత్రాన్ని పూర్తి చేసే పనిలో ఉన్న సూర్య టాలీవుడ్ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తమిళం, తెలుగు భాషలలో నిర్మించే చిత్రం గురించి చర్చలు జరుగుతున్న తరుణంలో రంజిత్ మాటలు ఆయన అభిమానుల్ని ఆనందంలో ముంచెత్తుతున్నాయి. రంజిత్ సూర్యతో చేసే చిత్రానికి కథను ఇంతకు ముందే రెడీ చేశారట.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement