'ఊపిరి'లో మరో గెస్ట్ | oopiri gets a new actress | Sakshi
Sakshi News home page

'ఊపిరి'లో మరో గెస్ట్

Jan 20 2016 6:48 PM | Updated on Jul 15 2019 9:21 PM

'ఊపిరి'లో మరో గెస్ట్ - Sakshi

'ఊపిరి'లో మరో గెస్ట్

సీనియర్ హీరోలు కథ ఎంపికలో తడబడుతుంటే, నాగార్జున మాత్రం ప్రయోగాత్మక చిత్రాలతో సత్తా చాటుతున్నాడు. సంక్రాంతి బరిలో సొగ్గాడే చిన్ని నాయనా సినిమాతో సూపర్ హిట్ కొట్టిన...

సీనియర్ హీరోలు కథ ఎంపికలో తడబడుతుంటే, నాగార్జున మాత్రం ప్రయోగాత్మక చిత్రాలతో సత్తా చాటుతున్నాడు. సంక్రాంతి బరిలో 'సొగ్గాడే చిన్ని నాయనా' తో సూపర్ హిట్ కొట్టిన నాగ్, ప్రస్తుతం తమిళ  హీరో కార్తీతో కలిసి ఊపిరి చిత్రంలోనటిస్తున్నాడు. ది ఇంటచబుల్స్ అనే ఫ్రెంచ్ మూవీ రీమేక్గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో వీల్ చైర్కే పరిమితమయ్యే పాత్రలో నటిస్తున్నాడు నాగ్.

నాగార్జున, కార్తీ హీరోలుగా నటిస్తున్న ఈ సినిమాలో తమన్నా హీరోయిన్గా కనిపించనుంది. అనుష్క, అడవిశేష్, నోరా ఫతేహి, సౌత్ ఆఫ్రికన్ మోడల్ గాబ్రియల్ లు అతిథి పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాకు ఇప్పుడు మరో గ్లామర్ యాడ్ అయ్యింది. ఒరిజినల్ వర్షన్ లో నాగ్ పాత్రకు హీరోయిన్ లేకపోయినా, నాగ్ ఇమేజ్ దృష్ట్యా ఊపిరి సినిమాలో హీరోయిన్ క్యారెక్టర్ ను యాడ్ చేశారు. ఆ పాత్రకు గతంలో నాగార్జున సరసన సంతోషం సినిమాలో హీరోయిన్ గా నటించిన శ్రియను ఎంపిక చేసారు. తెలుగు, తమిళ భాషల్లో పివిపి సంస్థ భారీగా నిర్మిస్తున్న ఈ సినిమా వేసవిలో రిలీజ్ కానుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement