ఓ మై గాడ్‌.. లాస్ వేగాస్‌: హీరో ఆవేదన

Omg Las Vegas... u city of happiness, tweets Nikhil

సాక్షి, హైదరాబాద్‌: అమెరికాలోని లాస్‌ వేగాస్‌లో సంగీత విభావరిలో కాల్పులు చోటుచేసుకోవడం తీవ్ర కలకలం రేపింది. సంగీత విభావరిలో పాల్గొన్నవారు లక్ష్యంగా సాయుధుడు జరిపిన కాల్పుల్లో ఇద్దరు మృతిచెందారు. దాదాపు 24 మందికి గాయాలయ్యాయి. దేశీయ సంగీత ఉత్సవంలో ఆనందంగా తేలిపోతున్న ఆహూతులను ఈ ఘటన ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురిచేసింది. సాయుధుడి కాల్పుల మోతతో భయభ్రాంతులకు గురైన ప్రజలు ప్రాణాలు దక్కించుకునేందుకు ఒక్కసారిగా పరుగులు పెట్టారు. తీవ్ర భయోత్పాతాన్ని రేకెత్తించిన ఈ ఘటనపై టాలీవుడ్‌ యువహీరో నిఖిల్‌ సిద్ధార్థ్ ట్విట్టర్‌లో స్పందించాడు.

'ఓ మై గాడ్‌ లాస్‌ వేగాస్‌. ఆనందదాయకమైన నగరంలో ఇలా జరగడం భావ్యం కాదు. అమాయకులపై ఇలా కాల్పులకు తెగబడుతున్న రాక్షసులను అడ్డుకొని శిక్షించాలి' అని నిఖిల్‌ ట్వీట్‌ చేశాడు. 'వందలాది తుపాకీ గుళ్లు పేలాయి. లాస్‌ వేగాస్‌లోని ప్రతి ఒక్కరి కోసం ప్రార్థిస్తున్నాను' అని పేర్కొన్నాడు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top