నువ్వే నా బంగారం... | Nuvve Naa Bangaram Audio on 29th November | Sakshi
Sakshi News home page

నువ్వే నా బంగారం...

Nov 20 2013 11:21 PM | Updated on Jul 12 2019 4:40 PM

నువ్వే నా బంగారం... - Sakshi

నువ్వే నా బంగారం...

సాయికృష్ణ, షీనా, నిషా కొఠారి ప్రధాన పాత్రధారులుగా రూపొందుతోన్న చిత్రం ‘నువ్వే నా బంగారం’. రామ్‌వెంకీ దర్శకుడు. పెరిచెర్ల కృష్ణంరాజు నిర్మాత.

సాయికృష్ణ, షీనా, నిషా కొఠారి ప్రధాన పాత్రధారులుగా రూపొందుతోన్న చిత్రం ‘నువ్వే నా బంగారం’. రామ్‌వెంకీ దర్శకుడు. పెరిచెర్ల కృష్ణంరాజు నిర్మాత. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన డి.ఐ వర్క్ జరుగుతోంది. యాజమాన్య స్వరాలందించిన ఈ చిత్రం పాటలను ఈ నెల 29న విడుదల చేయనున్నారు. యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి యాజమాన్య సంగీతం ప్రధాన ఆకర్షణ అని, విజువల్‌గా పాటలన్నీ చాలా ప్లెజెంట్‌గా ఉంటాయని, డిసెంబర్ ప్రథమార్థంలో సినిమాను విడుదల చేస్తామని నిర్మాత తెలిపారు. ఎలాంటి సినిమాను చూడాలని ప్రేక్షకులు ప్రస్తుతం కోరుకుంటున్నారో అలాంటి సినిమా ఇదని దర్శకుడు చెప్పారు. సుమన్, తనికెళ్ల భరణి, ప్రవీణ్, శ్రావణ్, శ్రీరాజ్, అశోక్‌కుమార్ తదితరులు ఇతర పాత్రలు పోషించిన ఈ చిత్రానికి కథ, మాటలు: లంకపల్లి శ్రీనివాస్, పాటలు: అనంతశ్రీరామ్, కెమెరా: రామ్, కూర్పు: ఎం.ఆర్.వర్మ.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement