నాన్‌ నన్‌చాకు తిప్పితే..!

Nunchaku Fight Scene Making on Peter Hein Interview - Sakshi

రజనీకాంత్‌... సింపుల్‌గా సింగిల్‌ టేక్‌లో బబుల్‌గమ్‌ని చేతిలోకి విసిరి నోట్లో వేసుకోగలరు. రూపాయి బిళ్లను గాల్లో విసిరి జేబులో పడేయగలరు. సిగిరెట్‌ను ఎగరేసి అవలీలగా నోటితో క్యాచ్‌ చేయగలరు. ఇదంతా ఆన్‌స్క్రీన్‌ మీద మనకు కనిపించేది. కానీ ఆఫ్‌స్క్రీన్‌ ఎన్నో రోజుల ప్రాక్టీస్‌ ఉంటుందట. అలాంటి ఓ విషయాన్నే పంచుకున్నారు ఫైట్‌ మాస్టర్‌ పీటర్‌ హెయిన్‌. రజనీకాంత్‌ నటించిన ‘పేట్టా’ (తెలుగులో ‘పేట’) ఇటీవల విడుదలైన విషయం తెలిసిందే. ఈ సినిమాలో ఇంటర్వెల్‌ ముందొచ్చే ఫైట్‌లో రజనీకాంత్‌ ‘నాన్‌ (నేను) ‘నన్‌చాకు’ (కరాటే స్టిక్స్‌)ని తిప్పితే అనే డైలాగ్‌ చెప్పలేదు కానీ.. తిప్పుతూ విలన్స్‌ను రఫ్‌ ఆడిస్తారు. ఆ సన్నివేశాలకు థియేటర్లు విజిల్స్‌తో దద్దరిల్లిపోయాయని ప్రత్యేకించి చెప్పక్కర్లేదు.

ఈ సీన్‌ ఇంత బాగా రావడానికి సుమారు 50 రోజుల కష్టం ఉందట. 50 రోజులపాటు నన్‌చాకు తిప్పడం ప్రాక్టీస్‌ చేశారట రజనీకాంత్‌. ఈ ఫైట్‌ గురించి పీటర్‌ హెయిన్‌ మాట్లాడుతూ – ‘‘పేట్టాలో ఒక ఫైట్‌ సన్నివేశానికి ఏదైనా స్పెషల్‌గా, రజనీకాంత్‌ గారు ఇంతకు ముందు ఎప్పుడూ చేయనిది చేయాలని ప్లాన్‌ చేశాం. కొన్నిరోజులు ఆలోచించాక నన్‌చాకుతో ఫైట్‌ ప్లాన్‌ చేశాను. ఈ ఐడియా చిత్రదర్శకుడు కార్తీక్‌ సుబ్బరాజ్‌కు చాలా నచ్చింది. షూటింగ్‌కు రెండు నెలల ముందు రజనీసార్‌తో చెప్పాను. సుమారు 50 రోజుల పాటు తీవ్రంగా ప్రాక్టీస్‌ చేశారాయన. స్క్రీన్‌ మీద చాలా ఈజీగా కనిపిస్తున్నా చాలా ప్రాక్టీస్‌ దాగి ఉంది అందులో. ప్రస్తుతం ఆ ఫైట్‌కు ఫ్యాన్సంతా విజిల్‌ కొడుతున్నారు, సంతోషంగా ఉంది’’ అని పేర్కొన్నారాయన.
∙రజనీకాంత్‌
∙రజనీతో పీటర్‌

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top