రణబీర్ తో పెళ్లి వార్తలు అవాస్తవం: కత్రినా | No plans for 2015 wedding, says Katrina Kaif | Sakshi
Sakshi News home page

రణబీర్ తో పెళ్లి వార్తలు అవాస్తవం: కత్రినా

Mar 28 2014 7:35 PM | Updated on Sep 2 2017 5:18 AM

రణబీర్ తో పెళ్లి వార్తలు అవాస్తవం: కత్రినా

రణబీర్ తో పెళ్లి వార్తలు అవాస్తవం: కత్రినా

బాలీవుడ్ నటుడు రణబీర్ కపూర్ తో పెళ్లివార్తలపై కత్రీనా కైఫ్ స్పందించారు.

బాలీవుడ్ నటుడు రణబీర్ కపూర్ తో పెళ్లివార్తలపై కత్రీనా కైఫ్ స్పందించారు. 2015లో రణబీర్, కత్రినాలు పెళ్లి చేసుకోబోతున్నారంటూ మీడియాలో వచ్చిన వార్తలను ఆమె ఖండించారు. పెళ్లి గురించి ప్లాన్స్ ఏమి లేవని.. ఈ రోజు మీడియాలో వార్త రావడం నా దృష్టికి వచ్చింది అని కత్రినా ఓ వార్తా ఏజెన్సీకిచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. 
 
పెళ్లి గురించి ప్రస్తావన తమ మధ్యలో రాలేదు. అలాంటిదేమైనా ఉంటే.. అందరికంటే ముందే మీకు వెల్లడిస్తాను అని కత్రినా తెలిపింది. మీడియాలో వచ్చిన రూమర్లతో తనకు ఇలాంటి ఇబ్బంది లేదని.. వ్యక్తిగత జీవితంలో ఇలాంటి వార్తలను ఎలా ఎదుర్కోవాలనే విషయాన్ని తాను నేర్చుకున్నానని ఆమె వెల్లడించింది.  ఇటీవల ఓ ఇంటర్వ్యూలో కత్రినా కైఫ్ తనకు ప్రత్యేకమైన వ్యక్తి అని రణబీర్ వెల్లడించిన సంగతి తెలిసిందే. 

Advertisement
 
Advertisement
Advertisement