బికినీలు, ముద్దులకు నో | No bikini, no kissing on screen for Tamannaah | Sakshi
Sakshi News home page

బికినీలు, ముద్దులకు నో

Jun 6 2014 1:36 PM | Updated on Sep 2 2017 8:24 AM

బికినీలు, ముద్దులకు నో

బికినీలు, ముద్దులకు నో

వెండితెరపై ఇప్పటి వరకు బికినీలు ధరించడం, ముద్దు సన్నివేశాలు వంటివాటిలో నటించలేదని భవిష్యత్తులో కూడా నటించనని మిల్కీ బ్యూటీ తమన్నా స్పష్టం చేశారు.

వెండితెరపై ఇప్పటి వరకు బికినీలు ధరించడం, ముద్దు సన్నివేశాలు వంటివాటిలో నటించలేదని భవిష్యత్తులో కూడా నటించనని మిల్కీ బ్యూటీ తమన్నా బాటియా స్పష్టం చేశారు. తమన్నా, ఇషా గుప్తా, బిపాసా బసులు నటించిన బాలీవుడ్ చిత్రం 'హమ్ షకల్స్' త్వరలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో శుక్రవారం తమన్నా ముంబైలో మాట్లాడింది. 'హమ్ షకల్స్' చిత్రంలోని ఓ సన్నివేశంలో హీరోయిన్లు బికినీ ధరించి నటించాల్సి వచ్చిందని చెప్పారు.

 

అయితే ఆ సన్నివేశంలో తాను మాత్రం షార్ట్స్ ధరించి నటించానని చెప్పారు. 'హమ్ షకల్స్' చిత్రంలో సైఫ్ అలీఖాన్ సరసన, అలాగే 'ఇట్స్ ఎంటర్టైన్మెంట్' చిత్రంలో అక్షయ్ కుమార్ సరసన నటిస్తున్నానని తెలిపారు. ఇద్దరు ఎంతో పరిణితి చెందిన మంచి నటులని తెలిపారు. అలాగే ఇద్దరికి నటనలో ఎంతో తేడా ఉందన్నారు. ఓంకార, హమ్తుమ్, ఏజెంట్ వినోద్ చిత్రాలలో సైఫ్ నటన ఆమోఘమని తమన్నా వెల్లడించింది.

Advertisement
 
Advertisement
Advertisement