breaking news
No bikini
-
బికినీకి నో
మలయాళీ బ్యూటీస్‌కు కోలీవుడ్‌లో లక్కేలక్కు అని చెప్పక తప్పదు. సీనియర్స్ ఆసిన్, నయనతార మొదలుకుని అమలాపాల్,లక్ష్మీమీనన్ వరకూ విజయాలను అవలీలగా అందుకున్నవాళ్లే. తాజాగా మరో మలయాళీ కుట్టి కోలీవుడ్‌కు రంగప్రవేశం చేసింది.ఆమే నటి కీర్తిసురేష్. నెట్ట్రికన్ను చిత్రంలో రజినీకాంత్ సరసన నటించి,1980 ప్రాంతంలో ప్రముఖ కథానాయికిగా వెలుగొందిన నటి మేనక వారసురాలే ఈ కీర్తిసురేష్. మాతృభాషలో బాలతారగా కొన్ని చిత్రాలు చేసిన ఈ బ్యూటీ ఆ తరువాత గీతాంజలి అనే చిత్రంతో కథానాయకిగా పరిచయమైంది.అలా అక్కడ రెండు మూడు చిత్రాలు చేసిందో లేదో కోలీవుడ్ అవకాశాలు అమ్మడి తలుపులు తట్టేశాయి. నటుడు శివ కార్తీకేయన్‌తో రజినీమురుగన్ చిత్రంలో రొమాన్స్ చేసే చాన్స్‌ను అందుకుంది. సాధారణంగా చిత్రం హిట్ అయితే మరిన్ని అవకాశాలు వస్తుంటాయి. కీర్తీ లక్ ఏంటంటే తొలి చిత్రం విడదల కాకుండానే వరుసగా మరో రెండు అవకాశాలు వచ్చేశాయి. దీంతో ఇంకేముంది పాప పారితోషికం పెంచేసిదనే ప్రచారం హోరెత్తుతోంది. దీనికి స్పందించిన కీర్తి షరామామూలు గానే బదులిచ్చింది. ఇంతకీ ఈ ముద్దుగమ్మ ఏమంటుందో చూద్దాం. తమిళంలో నటించే అవకాశం రావడం ఆనందంగా ఉంది. మా అమ్మ నటించిన ఇండస్ట్రీలో నేనూ చేయడమన్నది మరింత సంతోషకరమైన విషయం.అమ్మ కేర ళలో నివశిస్తున్నా ఇంటిలో తమిళంలోనే మాట్లాడుతుంటారు. అలా నేనూ తమిళ భాష నేర్చుకున్నాను. ఇప్పుడు తమిళంలో నా చిత్రాలకు నేనే డబ్బింగ్ చెప్పుకుంటున్నాను.శివకార్తికేయన్‌తో నటించిన రజినీమురుగన్, విక్రమ్‌ప్రభుకు జంటగా చేసిన ఇదు ఎన్న మాయం చిత్రాలు నిర్మాణం పూర్తి చేసుకుని వరుసగా విడుదలకు సిద్ధం అవుతున్నాయి. బాబిసింహకు జంటగా నటిస్తున్న పాంబుసండై నిర్మాణంలో ఉంది. ఒక్క చిత్రం కూడ విడుదల కాకుండానే మూడు చిత్రాల అవకాశాలు రావడం గురించి అడుగుతున్నారు. నేను చెప్పేది ఒక్కటే అంతా భగవంతుని కృపే. మలయాళం,తమిళ భాషలతో పాటు తెలుగులోనూ హరికథ, ఐనా ఇష్టం నువ్వు అనే రెండు చిత్రాల్లో నటిస్తున్నాను తెలుగు భాష తెలియక పోయినా డైలాగ్స్ తమిళంలో రాసుకుని బట్టీపట్టి చెప్పుకుంటున్నాను. ఇకపోతే స్విమ్మింగ్ డ్రస్‌లో నటిస్తారా? అని అడుగుతున్నారు. నేను ఈత దుస్తులకు దూరం. అలాగే నేను ఏ నటికీ పోటీ కాదు. పారితోషికం పెంచాననే ప్రచారం చేస్తున్నారు. నిజానికి అలాంటిదేమీ లేదు. నా స్థాయికి తగ్గపారితోషికాన్నే తీసుకుంటున్నాను. -
బికినీలు, ముద్దులకు నో
వెండితెరపై ఇప్పటి వరకు బికినీలు ధరించడం, ముద్దు సన్నివేశాలు వంటివాటిలో నటించలేదని భవిష్యత్తులో కూడా నటించనని మిల్కీ బ్యూటీ తమన్నా బాటియా స్పష్టం చేశారు. తమన్నా, ఇషా గుప్తా, బిపాసా బసులు నటించిన బాలీవుడ్ చిత్రం 'హమ్ షకల్స్' త్వరలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో శుక్రవారం తమన్నా ముంబైలో మాట్లాడింది. 'హమ్ షకల్స్' చిత్రంలోని ఓ సన్నివేశంలో హీరోయిన్లు బికినీ ధరించి నటించాల్సి వచ్చిందని చెప్పారు. అయితే ఆ సన్నివేశంలో తాను మాత్రం షార్ట్స్ ధరించి నటించానని చెప్పారు. 'హమ్ షకల్స్' చిత్రంలో సైఫ్ అలీఖాన్ సరసన, అలాగే 'ఇట్స్ ఎంటర్టైన్మెంట్' చిత్రంలో అక్షయ్ కుమార్ సరసన నటిస్తున్నానని తెలిపారు. ఇద్దరు ఎంతో పరిణితి చెందిన మంచి నటులని తెలిపారు. అలాగే ఇద్దరికి నటనలో ఎంతో తేడా ఉందన్నారు. ఓంకార, హమ్‌తుమ్, ఏజెంట్ వినోద్ చిత్రాలలో సైఫ్ నటన ఆమోఘమని తమన్నా వెల్లడించింది.