హీరో అఖిల్... నిర్మాత నితిన్! | nitin to produce first movie of akhil | Sakshi
Sakshi News home page

హీరో అఖిల్... నిర్మాత నితిన్!

Dec 18 2014 5:44 PM | Updated on Sep 2 2017 6:23 PM

హీరో అఖిల్... నిర్మాత నితిన్!

హీరో అఖిల్... నిర్మాత నితిన్!

కొంత కాలంగా వార్తల్లో ప్రథమాంశంగా నిలుస్తోన్న అఖిల్ అక్కినేని సినీ అరంగేట్రం జరిగింది. హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోలో పూజా కార్యక్రమాలు జరిగాయి.

కొంత కాలంగా వార్తల్లో ప్రథమాంశంగా నిలుస్తోన్న అఖిల్ అక్కినేని సినీ అరంగేట్రం జరిగింది. హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోలో పూజా కార్యక్రమాలు జరిగాయి. ముహూర్తపు దృశ్యానికి నాగచైతన్య కెమెరా స్విచాన్ చేయగా, అమల క్లాప్ ఇచ్చారు. నాగార్జున గౌరవ దర్శకత్వం వహించారు. ఈ చిత్రానికి హీరో నితిన్ నిర్మాత కావడం విశేషం. నితిన్ తండ్రి సుధాకర్‌రెడ్డి మరో నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. వీవీ వినాయక్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జనవరి మొదటి వారంలో మొదలు కానుంది.

నితిన్ మాట్లాడుతూ -‘‘అఖిల్ సరసన నటించే కొత్త హీరోయిన్ కోసం అన్వేషిస్తున్నాం. ‘దిల్’తో నా కెరీర్‌ని మలుపు తిప్పిన వినాయక్ దర్శకత్వంలో ఈ సినిమా నిర్మిస్తున్నందుకు ఆనందంగా ఉంది. ప్రేక్షకుల్ని, అభిమానుల్ని అలరించే అద్భుతమైన సినిమాగా ఈ చిత్రాన్ని రూపొందిస్తాం’’ అని చెప్పారు. సుధాకర్‌రెడ్డి మాట్లాడుతూ -‘‘ఈ సినిమా ముహూర్తం షాట్ తీసినట్లు అఖిల్, నితిన్‌లు ట్విట్టర్‌లో పెట్టగానే ఒక గంటలో రెండు లక్షల క్లిక్స్ వచ్చాయంటే ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఎంత క్రేజ్ ఉందో అర్థమవుతోంది’’ అని తెలిపారు. ఈ చిత్రానికి కథ: వెలిగొండ శ్రీనివాస్, మాటలు: కోన వెంకట్, కెమెరా: అమోల్ రాథోడ్, ఎడిటింగ్: గౌతంరాజు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement