'ఎక్కడికీ పోతావు చిన్నవాడా' ఫస్ట్ లుక్ | nikhils ekkadiki pothavu chinnavada first look | Sakshi
Sakshi News home page

'ఎక్కడికీ పోతావు చిన్నవాడా' ఫస్ట్ లుక్

Jun 1 2016 12:10 PM | Updated on Sep 4 2017 1:25 AM

'ఎక్కడికీ పోతావు చిన్నవాడా' ఫస్ట్ లుక్

'ఎక్కడికీ పోతావు చిన్నవాడా' ఫస్ట్ లుక్

స్వామి రారా, కార్తీకేయ లాంటి సినిమాల సక్సెస్లతో ఫాంలోకి వచ్చినట్టు కనిపించిన యంగ్ హీరో నిఖిల్, తరువాత శంకరాభరణం సినిమాతో మరోసారి నిరాశపరిచాడు.

స్వామి రారా, కార్తీకేయ లాంటి సినిమాల సక్సెస్లతో ఫాంలోకి వచ్చినట్టు కనిపించిన యంగ్ హీరో నిఖిల్, తరువాత శంకరాభరణం సినిమాతో మరోసారి నిరాశపరిచాడు. మినిమమ్ గ్యారెంటీ హీరోగా ప్రూవ్ చేసుకునే సమయంలో భారీ డిజాస్టర్ ఎదురుకావటంతో తన నెక్ట్స్ సినిమా విషయంలో జాగ్రత్తగా అడుగులు వేస్తున్నాడు. తనకు బాగా కలిసొచ్చిన ఎక్స్పరిమెంటల్ జానర్లోనే తదుపరి చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నాడు.

సందీప్ కిషన్ హీరోగా టైగర్ చిత్రాన్ని తెరకెక్కించిన విఐ ఆనంద్ దర్శకత్వంలో ఓ సోషియో ఫాంటసీ చిత్రంలో నటిస్తున్నాడు నిఖిల్. హేబా పటేల్, నందితా శ్వేత హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ పనుల్లో బిజీగా ఉన్న ఈ సినిమాకు 'ఎక్కడికీ పోతావు చిన్నవాడా' అనే టైటిల్ను ఫైనల్ చేశారు.  తాజాగా టైటిల్తో పాటు నిఖిల్ లుక్ను రివీల్ చేస్తున్న మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ను రిలీజ్ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement