నిఖిల్ హీరోగా 'కిర్రాక్ పార్టీ'..? | Nikhil Next Movie Kirrack Party Remake with Raju Sundaram | Sakshi
Sakshi News home page

నిఖిల్ హీరోగా 'కిర్రాక్ పార్టీ'..?

Apr 2 2017 12:39 PM | Updated on Sep 5 2017 7:46 AM

నిఖిల్ హీరోగా 'కిర్రాక్ పార్టీ'..?

నిఖిల్ హీరోగా 'కిర్రాక్ పార్టీ'..?

వరుస విజయాలతో మంచి ఫాంలో ఉన్న యంగ్ హీరో నిఖిల్, మరో ఇంట్రస్టింగ్ సినిమాకు ఓకె చెప్పాడన్న టాక్ వినిపిస్తోంది.

వరుస విజయాలతో మంచి ఫాంలో ఉన్న యంగ్ హీరో నిఖిల్, మరో ఇంట్రస్టింగ్ సినిమాకు ఓకె చెప్పాడన్న టాక్ వినిపిస్తోంది. ఎక్కడికీ పోతావు చిన్నవాడా సినిమాతో అన్ సీజన్లో కూడా బిగెస్ట్ హిట్ కొట్టిన నిఖిల్, త్వరలో కేశవగా మరో డిఫరెంట్ సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. కన్నడలో సూపర్ హిట్గా నిలిచిన కిర్రాక్ పార్టీ సినిమాను తెలుగులో నిఖిల్ హీరోగా తెరకెక్కిచేందుకు ప్లాన్ చేస్తున్నారు.

రాజ్ తరుణ్తో వరుస సినిమాలు చేస్తున్న ఏకె ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో ఈ సినిమాను నిర్మించేందుకు రెడీ అవుతోంది. ఈ సినిమాకు ప్రముఖ కొరియోగ్రాఫర్ రాజు సుందర్, ఈ సినిమాతో దర్శకుడిగా మారాలని భావిస్తున్నాడు. సీనియర్ హీరో నాగార్జున తో కలిసి చందూ మొండేటి దర్శకత్వంలో చేయాల్సిన మల్టీ స్టారర్ సినిమా ఆలస్యం అవుతుండటంతో ఈ లోగా కిర్రాక్ పార్టీ రీమేక్ ను పూర్తి చేయాలని భావిస్తున్నాడు నిఖిల్.

Advertisement
 
Advertisement
Advertisement