‘అర్జున్‌ సురవరం’ కొత్త రిలీజ్‌ డేట్‌

Nikhil Arjun Suravaram Gets New Release Date - Sakshi

యువ కథానాయకుడు నిఖిల్ హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం అర్జున్‌ సురవరం. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా రిలీజ్ విషయంలో మాత్రం క్లారిటీ రావటం లేదు. ఇప్పటికే చాలా సార్లు వాయిదా పడిన ఈ మూవీ మే 1న రిలీజ్‌ కావాల్సి ఉండగా మరో వాయిదా వేశారు. ప్రస్తుతం థియేటర్లలో ఉన్న అన్ని సినిమాలు మంచి వసూళ్లు సాధిస్తుండటంతో థియేటర్ల సమస్య ఎదురవుతుందని భావించి సినిమాను వాయిదా వేశారు.

తాజాగా ఈ సినిమాను మే 17న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. అయితే ఆ డేట్‌న రిలీజ్ చేయటం కూడా రిస్క్‌ అంటున్నారు విశ్లేషకులు మే 9న ప్రేక్షకుల ముందుకు వస్తున్న మహేష్ మహర్షికి సూపర్‌ హిట్‌ టాక్‌ వస్తే ఆ ప్రభావం రెండు వారాల పాటు ఉంటుంది. అలాంటి సమయంలో సినిమా రిలీజ్ చేస్తే థియేటర్లు దొరకటం కూడా కష్టమే. మరి నిఖిల్‌ ఆ రిస్క్‌ చేస్తాడా..? లేదా చూడాలి.

తమిళసూపర్‌ హిట్ సినిమా కనితన్‌కు రీమేక్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో నిఖిల్ కు జోడిగా లావణ్య త్రిపాఠి నటిస్తోంది. టీఎన్‌ సంతోష్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాను రాజ్‌ కుమార్‌ ఆకెళ్ల, కావ్య వేణుగోపాల్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top