ఫ్రెండ్‌ మాత్రమే

Nikesha denies rumours of wedding with Prabhudeva - Sakshi

అడిగిన ప్రశ్నకు సూటిగా సుత్తి లేకుండా సమాధానం చెబితే ఏ తంటా ఉండదు. అలా కాకుండా వేరే విధంగా చెబితే చిక్కులు వచ్చి పడతాయి. ‘పులి’ ఫేమ్‌ నికిషా పటేల్‌కి అలాంటి అనుభవమే ఎదురైంది. ప్రభుదేవాతో కలిసి యాక్ట్‌ చేసే ఆలోచన ఉందా? అని ఓ విలేకరి నికిషాని అడిగితే.. ‘‘మీరేమో ప్రభుదేవాతో కలిసి యాక్ట్‌ చేస్తారా? అని అడుగుతున్నారు. బట్‌ నాకు ప్రభుదేవాని పెళ్లాడాలని ఉంది’’ అని పేర్కొన్నారట నికిషా.

దాంతో ప్రభుదేవా, నికిషా పెళ్లి చేసుకోబోతున్నారన్న వార్తలు ఇంటర్‌నెట్‌లో హడావిడి చేశాయి. ఇది తెలుసుకున్న నికిషా.. ఈ  వార్తలకు వెంటనే ట్వీటర్‌లో స్పందిస్తూ – ‘‘ఫోన్‌ కాల్స్, మెసేజ్‌లతో విసిగిపోయాను. ప్రభుదేవా సార్, నేనూ పెళ్లి చేసుకోబోతున్నాం అన్న వార్తల్లో ఎలాంటి నిజం లేదు. ఎక్కడో మిస్‌ అండర్‌స్టాండింగ్‌ జరిగింది. ప్రభుదేవా సార్‌ నాకు జస్ట్‌ ఫ్రెండ్‌ మాత్రమే. నా వెల్‌ విషర్‌. నేను ఆయన్ను సార్‌ అనే పిలుస్తాను. ప్రస్తుతం నా వర్క్, నా ఫ్యామిలీతో బిజీగా ఉన్నాను’’ అని క్లారిఫై చేశారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top