ప్రేమికులరోజు శాంపిల్‌

ngk movie teaser release on feb 14 - Sakshi

‘ఎన్‌జీకే’ (నంద గోపాల కుమరన్‌) ఎలా ఉంటాడో ఫస్ట్‌ లుక్‌లో చూశాం. మరి.. ఏం చేస్తుంటాడు? అతని లక్ష్యాలు ఏంటి? అనే విషయాలు గురించి హింట్‌ ఇవ్వడానికి రెడీ అయ్యారు ‘ఎన్‌జీకే’ టీమ్‌. అంటే శాంపిల్‌గా ఈ సినిమా టీజర్‌ను రిలీజ్‌ చేస్తారు. సూర్య హీరోగా సెల్వరాఘవన్‌ దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘ఎన్‌జీకే’. ఇందులో సాయి పల్లవి, రకుల్‌ ప్రీత్‌సింగ్‌ కథానాయికలుగా నటించారు. ఈ సినిమా టీజర్‌ను ప్రేమికుల రోజు (ఫిబ్రవరి 14న) విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ఈ సినిమాలో శక్తివంతమైన రాజకీయ నాయకుడి పాత్రలో సూర్య కనిపిస్తారని సమాచారం. జగపతిబాబు, ఇళవరసు, రామ్‌కుమార్‌ గణేశన్‌ కీలక పాత్రలు చేశారు. ఈ సినిమా సమ్మర్‌లో రానుంది.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top